ప్రపంచ వ్యాప్తంగా చిరపరిచితుడూ, ప్రసిద్ధుడైన ప్ర ముఖ కవి, సినీ దర్శకుడు గుల్జార్ అసలు పేరు సం పూర్ణసింగ్ కల్రా. భారతీయ సాహిత్యంలో, సినిమా రంగంలో అత్యంత గౌరవనీయమైన కవులలో, దర్శకులలో ఒకరు. గుల్జార్ కవిత్వంలో, సినిమాల్లో లోతైన మానవ భావోద్వేగాలను, సంబం ధాలను, జీవితంలోని అతి సూక్ష్మమైన అంశాలను స్పృశిం చారు.
గుల్జార్ తన కవితలలో పాఠకులకు అర్థమయ్యే సులభమైన రోజువారీ వ్యవహారిక భాషను ఉపయోగిస్తారు. ఐతే ఈ సరళత వెనుక లోతైన అర్థం దాగి ఉంటుంది. ప్రేమ, విరహం, ఒంటరి తనం, ఆశ, నిరాశ వంటి మానవ భావోద్వేగాలను గుల్జార్ చాలా తీవ్రంగా మరియు హృద్యంగా వ్యక్తీకరిస్తారు.
గుల్జార్ తన కవితల్లో అద్భుతమైన రూపకాలను, ఉపమా నాలను ఉపయోగిస్తారు. అతని కవితల్లో పదాలు ఒక ప్రత్యేకమై న శ్రావ్యతను కలిగి ఉంటాయి. సంప్రదాయ విషయాలను స్పృ శిస్తూనే ఆధునిక దృక్పథాన్ని కలిగి ఉన్న సమకాలీన కవి గుల్జార్. మానవ అనుభవంలోని సార్వత్రిక అంశాలను తన కవితల్లో ప్రతిబింబిస్తూ గుల్జార్ తన కవితల ద్వారా పాఠకుల హృదయా లను తాకి ఆలోచనలను రేకెత్తిస్తారు. గుల్జార్ భారతీయ సాహి త్యంలో మహోన్నత శిఖరం. అతని సాహిత్యం, సినిమాలు తరగని సంపద. గుల్జార్ కవిత్వం నుండి ఎంపిక చేసిన 100 చిన్న కవితలను దేవులపల్లి అమర్ తెలుగులోకి అనువాదం చేయగా, ఆ కవితలకు అర్ధవంతమైన చిత్రాలను దేవులపల్లి శృతి వేసారు. గత కొన్ని వారాలుగా మెహఫిల్‌లో వచ్చిన గుల్హార్ కవిత్వ పరంపర ఈసారితో ముగుస్తున్నది.
మిల్తా తో బోహాత్ కుచ్
హై ఇస్ జిందగీ మె
బస్ హమ్ గింతీ ఉసీ కి
కర్తె హై జో హాసీల్ న హో సకా
దొరికింది కానీ
చాలానే ఈ జీవితంలో
లెక్కిస్తూ ఉంటాం ఎప్పుడూ
మనకు దొరకకుండా
పోయినవాటి గురించే
దిల్ అగర్ హై తో
దర్ద్ భి హోగా
ఇస్ కా శాయేద్ కోయి
హల్ నహి హోగా
హృదయమంటూ ఉన్నప్పుడు
వేదన తప్పదు కదా
బహుశా పరిష్కారమంటూ
ఉండదుకదా దీనికి
వఖ్త్ రహేతా నహి
కహీ టిక్ కర్
ఆదత్ ఇసకీ భి
ఆద్మీ సీ హై
కుదురుగా ఉండదు కదా
కాలమెప్పుడూ ఒకే చోట
అలవాటయింది దీనికి కూడా
మనుషులనుండే మరి
వో చీజ్ జిస్ దిల్ కహెతే హై హమ్
భూల్ గయే హై రక్ కే కహీ
హృదయమని అంటారే దాన్ని
మరచిపోయా దాన్నక్కడో పెట్టేసి
బోహాత్ ముషీ్కిల్ సే కర్తా హు తేరే యాదొంకా కారోబార్
మునాఫా కమ్ హై
పర్ గుజారా హో భి జాతా హై
ఎంతో కష్టంగా చేస్తున్నా
నీ జ్ఞాపకాలతో వ్యాపారం
ఏదో పర్లేదు గడిచిపోతుందలా
లాభాలు చాలా తక్కువైనా
అనువాదం: దేవులపల్లి అమర్ బొమ్మలు: దేవులపల్లి శృతి