Friday, April 19, 2024

నైజీరియా పాఠశాల నుంచి 300 మంది బాలికల అపహరణ..?

- Advertisement -
- Advertisement -

Hundreds of girls Abducted by gunmen in Nigeria

 

లాగోస్: నైజీరియాలోని వందలాది బాలికలను సాయుధముఠా అపహరించింది. శుక్రవారం ఉదయం జంపారా రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. కిడ్నాప్ జరిగిన సెకండరీ స్కూల్‌లో రికార్డుల ప్రకారం మొత్తం 300మంది బాలికలు చదువుతున్నారు. 10, 13 ఏళ్ల వయసున్న తన ఇద్దరు కుమార్తెలు కిడ్నాప్‌నకు గురైనట్టు నసీర్‌అబ్దుల్లా అనే స్థానికుడు తెలిపారు. తమకు ఎవరూ అడ్డు రాకుండా ఉండేందుకు సమీపంలోని మిలిటరీ క్యాంప్, చెక్‌పోస్టుపై సాయుధముఠా దాడి చేసినట్టు మరో స్థానికుడు తెలిపారు. డబ్బు, జైళ్లలో ఉన్న తమ సభ్యులను విడుదల చేయించడం కోసం బందిపోట్ల ముఠా ఈ కిడ్నాప్‌నకు పాల్పడినట్టు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అయితే, నైజీరియాలో పాఠశాల బాలికలను అపహరించడం ఇదే మొదటిసారి కాదు. బోకోహారం అనే జిహాదీ సంస్థ 2014లో బోర్నో రాష్ట్రం చిబోక్‌లోని సెకండరీ స్కూల్ నుంచి 276మంది బాలికలను అపహరించింది. వందమందికిపైగా బాలికలు ఇంకా ఆ ముఠా చేతిలోనే బందీలుగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News