Thursday, March 28, 2024

ఎలన్ మస్క్ బాసిజం తట్టుకోలేక రాజీనామా చేస్తున్న ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: శ్రద్ధతో, నిబద్ధతతో, ఎక్కువ సమయం పనిచేయాలని ట్విట్టర్ కొత్త యజమాని ఎలన్ మస్క్ పెడుతున్న షరతులు, బాసిజం తట్టుకోలేక అనేక మంది ఉద్యోగులు ఆ సంస్థలో రాజీనామా చేస్తున్నారు. వందలాది మంది గురువారం రాజీనామా చేశారు. బ్రేక్ త్రూ ట్విట్టర్ 2.0ను నిర్మించడానికి కలిసి వస్తారా, లేకుంటే బయటికి పోతారా? అంటూ 36 గంటల గడువు ఇవ్వడంతో చాలా మంది ఇంటి పోడానికి నిర్ణయించుకున్నారు. మూడు నెలల జీతంతో బయటపడదామనుకుంటున్నారు. చాలా మంది ఉద్యోగులు ట్విట్టర్ స్లాక్‌లో శాల్యూట్ ఇమోజీ, ఫేర్‌వెల్ మెసేజ్‌లు పెట్టారని తెలుస్తోంది. ట్విట్టర్ కంపెనీ మొత్తం 7500 మంది ఉద్యోగుల్లో ఇప్పుడు దాదాపు 2900 మంది మాత్రమే మిగిలారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News