Home కామారెడ్డి చర్చగా మారిన గడీ కోట

చర్చగా మారిన గడీ కోట

 Hundreds worth crores of assets

మనతెలంగాణ/కామారెడ్డి: 400 ఏళ్ల చరిత్ర వందల కోట్ల విలువైన ఆస్తులు గల దోమకోండ గడీ కోట చర్చనీయాంశంగా మారింది. కోట వారసులు భవనాలకు పోటాపోటీ తాళాలు వేసుకోవడం పోలీసు కేసు నమోదు కావడంతో రాష్ట్రంలోనే కాక జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వెంకట భవన్, అద్దాల బంగ్లా, మహాదేవుని గుడి, 40 ఎకరాల ప్రహారీ గోడ, వందలకోట్ల రూపాయల ఆస్తులు వారసుల వివాదంలో చిక్కుకున్నాయి. 400 ఏళ్ల చరిత్ర గల దోమకొండ సంస్థానాన్ని రాజన్న చౌదరి పాలించారు. 400 ఏళ్ళుగా 8 తరాలు సంస్థానాన్ని పాలించాయి. ఈ సంస్థానాలలోని గ్రామాలు ప్రస్తుతం మెదక్, సిద్దిపేట, సిరిసిల్లా కామారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. 50 ఫీట్‌ల ఎత్తు, 15 ఫీట్‌ల వెడుల్పుతో 40 ఎకరాల్లో దుర్బేద్యమైన ప్రహారీ గోడను నిర్మించారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఉమాపతిరావు అతని కొడుకు అనిల్ కుమార్ గడి కోటను రూ.10 కోట్లను పునరుద్ధరిస్తున్నారు. నిజాం ప్రభువులను కప్పం కట్టి 400 ఏళ్ళు కామినేని వంశస్తులు దోమకొండ సంస్థానాన్ని పాలించారని చరిత్ర తెలియజేస్తుంది. అనిల్‌కుమార్ అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్‌రెడ్డి కూతురు శోభనను పెళ్ళి చేసుకున్నారు. అనిల్ కుమార్, శోభనల కూతురు ఉపాసన సినీ నటుడు రాం చరణ్ వివాహమాడారు. మోగాస్టార్ చిరంజీవి కోట వారసులు అనిల్‌కుమార్ వియ్యంకులు. ఉపాసన రాంచరణ్ పెళ్ళి నిశ్చితార్థం దోమకొండ గడీకోటలో జరుగడంతో గడీ కోట విస్తృత ప్రచారమైంది.
ఆస్తుల గొడవతో, భవనాలకు తాళాలు వేసుకోవడం, పోలీసుకేసులు నమోదు కావ డం మరోమారు ప్రస్తుత వార్తల్లోకి ఎక్కింది. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఉమాపతిరావు, అనిల్‌కుమార్‌లు కామారెడ్డి కోర్టులో హజరుకావాలని సమన్లు జారికావడం చర్చానీయ అంశంగా మారింది. ఉమాపతిరావు టిటిడి చైర్మెన్‌గా, విద్యుత్ బోర్డు అధ్యక్షునిగా పనిచేశారు. 40 ఎకరాల ప్రహారీ గోడ పురావస్తు శాఖ ఆధీనంలో ఉండగా లోపలి భవనాలు, భూములు కామినేని వంశస్తులకు చెందిన ఆస్తులు.