Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) కొత్త కలెక్టరేట్‌లకు స్థలాల వేట

కొత్త కలెక్టరేట్‌లకు స్థలాల వేట

MAHI

మన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :  కొత్త జిల్లాల్లో సకల హంగులతో ఆధునిక సౌకర్యాలతో సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అందుకు అనుగు ణంగా కలెక్టరేట్‌ల స్థలాల ఎంపిక కార్యక్రమం చురు కుగా సాగుతుంది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఎర్పాటు చేసిన మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, వికారాబాద్ జిల్లాలు ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్నందున సంవత్సర కాలంలో కొత్త భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తుంది.

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను శంషాబాద్‌తో పాటు మహేశ్వరం మండల పరిధిలోని రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో నిర్మించాలని మొదట ప్రభుత్వం ప్రతిపాధించిన ప్రస్తుతం దాదా పుగా వెనక్కితగ్గి లకడికాపూల్‌లోని ప్రస్తుత భవనంలోనే కొనసాగించ డానికి సిద్దం అవుతున్నట్లు తెలిసింది.రంగారెడ్డి కలెక్టరేట్‌ను ఔటర్ రింగ్‌రోడ్డు వైపు తరలించాలని ఇప్పటికే ఇబ్రహింపట్నం నియోజకవర్గం నేతలు బొంగ్లూర్ గేట్ వద్ద మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అద్వర్యంలో దర్నా నిర్వహించగా శంషాబా ద్‌లోనే ఏర్పాటు చేయాలని మరోవైపు శంషాబాద్ అఖిలపక్ష నాయకులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు. ఇబ్రహిం పట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తీగల క్రిష్ణారెడ్డి, ప్రకాష్‌గౌడ్‌లు తమ నియోజకవ ర్గాల్లోనే జిల్లా కేంద్రాలను ఏర్పా టు చేసుకోవాలని పట్టుబడుతున్నట్లు ప్రచా రం జరుగుతుంది. రంగారెడ్డి కొత్త కలెక్టరేట్ నిర్మాణం అధికార పార్టీ నాయకుల్లో చిచ్చురేపే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి లకడికపూల్‌లోనే కొనసాగించడం వైపు ప్రభు త్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  శామీర్‌పేట్‌లోనే మేడ్చల్ కలెక్టరేట్ : కొత్తగా ఏర్పడిన మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా తాత్కలిక కలెక్టరేట్ కీసర మండల పరిధిలో ఔటర్ రింగ్‌రోడ్డుకు ఆనుకోని ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నారు.

కొత్తగా నిర్మించనున్న సమీకృత భవనాలను శామీర్‌పేట్‌లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేయడంతో పాటు అందుకు అనుకూలంగా స్థలాలను ఎంపిక చేస్తుంది. ఔటర్‌కు ఆనుకోని శామీర్‌పేట్ మండల పరిధిలోని దొంగల మైసమ్మ 164/1 వద్ద గత 35 ఎకరాలు స్థలంతో పాటు ఉప్పర్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వె నెంబర్ 837లోని 10 ఎకరాలు, హకీంపేట్ స్పోర్ట్ స్కూల్ పక్కనే ఉన్న 100 ఎకరాల అటవి భూమిని గుర్తించిన జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రభుత్వంకు తమ నివేదికలు పంపింది.

వికారాబాద్ కలెక్టరేట్‌ను పట్టణానికి అనుకోని ప్రధాన రహదారిపై పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సంగం లక్ష్మిబాయి పాఠశాలతో పాటు ఎస్‌ఎపి కళాశాల వెనకల 20 ఎకరాలకు పైగా ఉన్న మరోస్థలంను సైతం పరిశీలించి నివేదికలను సిద్దం చేస్తున్నారు. సంగం లక్ష్మిబాయి పాఠశాల వద్ద కేవలం 10 ఎకరాలు ఉండటంతో పాటు దానికి ఆనుకోని ఎస్‌పి కార్యాలయం మరో 12 ఎకరాల విస్తీర్ణంలో ఉండటంతో రెండు కలిపి భవనాలను నిర్మించడం వలన అనుకూ లంగా ఉంటుందని ప్రజా ప్రతినిధులు, అధికారులు సైతం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక్కడ భవనాలను నిర్మించడం అందరికి సౌకర్యంగా ఉండటంతో పాటు రవాణ పరంగా అనుకూలంగా ఉంటుంది. కాని జిల్లా కలెక్టర్ దివ్య మాత్రం వికారాబాద పట్టణం నుంచి మూడు కి.మి దూరంలో ఎస్‌ఎపి కళాశాల వద్ద కలెక్టరేట్ నిర్మాణం చేయడానికి మొగ్గుచూపుతున్నారు. మేడ్చల్, వికారాబాద్ కలెక్టరేట్‌ల స్థలాల తుదిఖరారు మాత్రం ప్రభుత్వం చేయనుంది.