Home వరంగల్ భార్యపై భర్త గొడ్డలితో దాడి

భార్యపై భర్త గొడ్డలితో దాడి

Husband Attack His Wife In Warangal District

ఎంజిఎం :భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన సంఘటన వరంగల్ జిల్లా ఎల్కతుర్తి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం ఎర్రపెద్ది మంజూలదేవి వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలానికి చెందిన వారు గత సంవత్సరం నుండి బార్యభర్తలు గొడవలు పడుతున్నారు. తదుపరి అనంతరం గొడవలను తట్టుకోలేక మంజూలదేవి వేరేగా కిరాయి నివాసంలో జీవనాన్ని కొన్ని నెలల నుండి కొనసాగిస్తుంది. మంగళవారం తమ కుమారుడు ఉన్న కిరాయి ఇంటి వద్ద ఉన్న వ్యక్తి వద్దకు వెళ్ళి బయటకు వస్తున్న క్రమంలో మంజూల భర్త అయిన వెంకటయ్య నీ దగ్గర ఉన్న రూ.10లక్షలు, బంగారం ఉందని గొడవకు దిగి గొడ్డలితో తన భార్య మంజూలపై దాడి చేస్తున్నట్లు గ్రహించిన మంజూల పారి పోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వెంకటయ్య గొడ్డలితో దాడి చేయడంతో ఎడమ చెయ్యి విరిగి భుజంపై గాయాలు అయ్యాయి. ఇంటి పక్కన స్థానికులు గమనించి వెంకటయ్యను ఆపారు. అనంతరం చికిత్స నిమిత్తం 108 సహాయంతో ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.