Friday, March 29, 2024

అనుమానానికి నలుగురు బలి

- Advertisement -
- Advertisement -

భార్య, ఇద్దరు పిల్లలను చంపి భర్త ఆత్మహత్య
హైదరబాద్ చందానగర్‌లో దారుణం

మన తెలంగాణ/శేరిలింగంపల్లి: అనుమానం నాలుగు ప్రాణాలను బలితీసుకుంది. భార్యపై అనుమానంతో ము క్కుపచ్చలారని ఇద్దరు పిల్లలు, భార్యను హత్య చేసిన తరువాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హై దరాబాద్‌లోని చం దానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చందానగర్ సిఐ కాస్ట్రో తెలిపిన వివరాల ప్ర కారం… సంగారెడ్డి జిల్లా కోహిర్‌కు చెందిన నాగరాజు (42), భార్య సుజాత (36), పిల్లలు సిద్ధు (11), రమ్యశ్రీ (7)తో ఏడేళ్ల క్రితం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్పకు వచ్చి బ్లాక్ నెంబర్ 18లో నివాసముంటూ వాహనం తిరుగుతూ షాపులకు బ్రెడ్ అమ్మేవాడు కాగా భార్య సుజాత ఇంటి వద్ద ఉంటూ టైలరింగ్ పని చేసుకునేది. కొద్ది రోజుల నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న నాగరాజు గత కొంతకాలంగా భార్యతో గొడవపడేవాడు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ పెద్దదైంది. దీంతో విచక్షణ కోల్పోయిన నాగరాజు టైలరింగ్‌కు ఉపయోగించే కత్తెరతో భార్యపై దాడి చేసి భార్యను ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. అనంతరం తాను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు.

అక్కతో రోజూ ఫోన్‌లో మాట్లాడే సుజాత గత రెండు రోజులుగా ఫోన్ చేయడం లేదని, తాను ఫోన్ చేసిన తీయడం లేదని పక్కింటి వాళ్లకి ఫోన్ చేసి చెప్పడంతో వారు నాగరాజు దంపతులు ఉండే కిటికి అద్దాలు పగలగొట్టి చూసేసరికి నాగరాజు ఉరివేసుకొని, ఇద్దరు పిల్లలు కింద పడి ఉన్నారు. దీంతో స్థానికులు చందానగర్ పోలీసులకు సమాచారం చేరవేయడంతో క్లూస్ టీం సహాయంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి పరిశీలించగా భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి నాగరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. భార్యపై అనుమానంతో ముగ్గురిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సైకోలా ప్రవర్తించేవాడు : స్థానికులు

సుజాత టైలరింగ్‌తోపాటు ఫైనాన్స్ నడిపేదని స్థానికులు తెలిపారు. నాగరాజు సైకోలా ప్రవర్తించేవాడని, ప్రతి రోజు సుజాతను వేధింపులకు గురిచేసేవాడని తెలిపారు. భర్త తనను రోజు వేధించే విషయం తమకు చెప్పి బాధపడేదని అన్నారు. గత శుక్రవారం చివరిసారిగా సుజాతను చూశామని తెలిపారు. నాగరాజు ఇలా భార్య, పిల్లలను హత్య చేస్తాడని తాము ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్థిక ఇబ్బందులు లేవు : పోలీసులు

నాగరాజు కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని పోలీసులు తెలిపారు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న నాగరాజు తరచూ ఆమెతో గొడవ పెట్టుకునేవాడని తెలిపారు. అనుమానమా లేక నాగరాజు మానసికస్థితి సరిగా లేక హత్యలు చేసి ఉంటాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చందానగర్ ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News