Thursday, March 28, 2024

అనుమానంతో భార్య తలనరికిన భర్త

- Advertisement -
- Advertisement -

Husband Cuts Wife Head At Sangareddy District

సంగారెడ్డి: అనుమానంతో కట్టుకున్న భార్య తల నరికి మరో ఇంటి ముందు పారేసిన దారుణ సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నారాయణఖేడ్ కు చెందిన సాయిలు(50) తన భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానిస్తూ వచ్చాడు. ఆ అనుమానం అతని కుటుంబంలో పెనుభూతమైంది. ఈ క్రమంలో నిన్న రాత్రి భార్య తలను సాయిలు గొడ్డలితో నరికేశాడు. అనంతరం భార్య తలతో బైక్ మీద 5 కిలోమీటర్లు తిరిగాడు. భార్య ఎవరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించాడో, ఆమె తలను తీసుకువెళ్లి ఆ వ్యక్తి ఇంటిముందు పడేశాడు. ఉదయం తలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడు సాయిలును అరెస్టు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటన స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News