Friday, April 26, 2024

గృహహింస కేసులో భర్తకు మూడేళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -
Husband given 3 year prison sentence for harassing wife
రెండో భార్యకు ఏడాది జైలు

హైదరాబాద్: భార్యను వేధించిన భర్తకు, రెండో భార్యకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ మల్కాజ్‌గిరి కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం… కాప్రా, భవానీనగర్‌కు చెందిన భవానీ అలియాస్ గాయత్రీకి రైల్వే ఉద్యోగి ప్రేమ్‌కుమార్‌తో 2002లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలకు ఉన్నారు. ప్రేమ్‌కుమార్ తనతో పనిచేసే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రోజు తాగి వచ్చి భార్యను వేధిస్తున్నారు. 2014లో ఇంటి నుంచి ప్రేమ్‌కుమార్, కవిత ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. వెంటనే కవిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన కుషాయిగూడ పోలీసులు ఇద్దరిని తీసుకుని వచ్చారు. ఇద్దరు రెండో వివాహం చేసుకున్నారు. రోజు తాగి వచ్చి భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడు. మే,05,2016లో మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడి, విచక్షణా రహితంగా కొట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. కోర్టులో సాక్షాలు ప్రవేశపెట్టగా కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News