Home జగిత్యాల అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

Murder

కోరుట్ల రూరల్: అనుమానం పె ను భూతంగా మారి హత్యకు దారి తీసింది.  కోరు ట్ల పట్టణంలోని ఐబి రోడ్‌లో  గుర్రం శంకర్ తన భార్య వనితల దాంపత్య జీవితంలో భార్యపై అను మానం పెంచుకోగా తరచు గొడవలు జరుగుతు ండేవి. గత మూడు నెలల క్రితం భార్యభర్తల మ ధ్య జరిగిన గొడవవల్ల  ఆమె  పుట్టినింటికి వెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం  శంకర్ వనిత ను తనతో రావాలని గొడవ పెట్టుకుని బలవంత ంగా ఐబి రోడ్‌లో గల తన ఇంటికి తీసుకవచ్చి గది తలుపు లు మూసి ఇనుపరాడ్‌తో తీవ్రంగా బాదాడని దీంతో దెబ్బల కు తాళలేక ఆమె కేకలు వేసిందని,  ఎవరూ కాపా డలేకపోవడం తో ఆమె రక్తం మడుగులో తుది శ్వాస విడిచిందని స్థానికులు వెల్లడించారు. ఘట నా స్థలానికి చేరు కున్న సిఐ రాజశేఖర రాజు,ఎస్ కృష్ణకుమార్‌లు మృతదేహా న్ని పోస్టుమార్టంకు తరలించారు.