Home తాజా వార్తలు భార్య ఫోన్‌లో మాట్లాడుతుందని… చావబాదాడు

భార్య ఫోన్‌లో మాట్లాడుతుందని… చావబాదాడు

Husband killed wife over phone in Sangareddy

సంగారెడ్డి: భార్య తరచూ ఫోన్‌లో మాట్లాడుతుందని ఆమెను భర్త తీవ్రంగా కొట్టడంతో చనిపోయిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రుద్రారం గ్రామంలో స్వప్ప-రమేష్ అనే దంపతులు నివసిస్తున్నారు. తరచూ అర్థరాత్రి వేళ ఆమె ఫోన్‌లో మాట్లాడుతుండడంతో భర్త అనుమానించాడు. సోమవారం రాత్రి ఆమె ఫోన్‌లో మాట్లాడుతుండడంతో భార్యను భర్త తీవ్రంగా కొట్టాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత అత్తమామలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే స్వప్న తల్లిదండ్రులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని తెలిపారు. స్వప్న తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త రమేష్‌ను పోలీసుల అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అనుమానంతో తాను కొట్టడంతో ఆమె చనిపోయిందని భర్త ఒప్పుకున్నాడు.