Home ఆంధ్రప్రదేశ్ వార్తలు నడిరోడ్డుపై భార్యను హతమార్చిన భర్త

నడిరోడ్డుపై భార్యను హతమార్చిన భర్త

Murder

అమరావతి: విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను ఓ భర్త కర్కశంగా నడిరోడ్డుపై నరికి చంపిన సంఘటన విజయవాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రదీప్, మణిక్రాంతి నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రదీప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, మణిక్రాంతి ఓ ప్రవేట్ దవాఖానాలో నర్సుగా పని చేస్తుంది. ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య తరచుగా గొడవలు రావడంతో మణిక్రాంతి తన పుట్టింట్టికి వెళ్లి తల్లి దగ్గర ఉంటుంది.

Husband wife

 

ఈ క్రమంలోనే వీరిద్దరు విడాకుల కోసం కోర్టులో కేసు వేయగా , ఆ కేసు చివరి దశకు చేరుకుంది. గతంలో మణిక్రాంతి భర్తపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో  ప్రదీప్‌ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. శనివారం ప్రదీప్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. ప్రదీప్ మణిక్రాంతిని నడిరోడ్డుపై ఆమె తల్లి ముందే అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. మణిక్రాంతి తలని పట్టుకెళ్లి పక్కనే వున్న కాల్వలో పడేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తన భర్తతో ప్రాణభయం ఉందని మణిక్రాంతి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు పట్టించుకోలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తమ కూతురి హత్యకు పోలీసులే కారణమని మణిక్రాంతి మృతదేహంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.

Husband kills wife in Vijayawada