Friday, March 29, 2024

ఎఫ్‌బిలో అశ్లీల దృశ్యాలు… భర్తపై కేసు పెట్టిన భార్య

- Advertisement -
- Advertisement -

Husband posts wife’s intimate videos

 

బెంగళూరు: భార్యతో ఉన్న అశ్లీల దృశ్యాలు భర్త సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అతడిపై ఆమె కేసు పెట్టిన సంఘటన కర్నాటకలో జరిగింది. పోలీసులు అతడిపై కేసు నమోదు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రేష్మి (అసలు పేరు కాదు) అనే అమ్మాయి 2008లో షఫీక్‌ను పెళ్లి చేసుకుంది. 2015లో షఫీక్‌తో ఆమె విడాకులు తీసుకుంది. తనతో పాటు పని చేసే హరికృష్ణతో ప్రేమలో పడింది. హరికృష్ణను 2019లో ఆమె వివాహం చేసుకుంది. రేష్మి మొదటి భర్తతో సంబంధం కొనసాగిస్తోందని హరికృష్ణ అనుమనించడమే కాకుండా ఆమెను పలుమార్లు  వేధించాడు. భార్యతో చనువుగా ఉన్న దృశ్యాలను హరికృష్ణ తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News