Home స్పెషల్ ఆర్టికల్స్ కీచక మొగుడు

కీచక మొగుడు

Saleem

వీడియో తీసి స్నేహితులకు పంపిన వైనం

హైదరాబాద్ సిటీబ్యూరో: పాత బస్తీలో సభ్యసమాజం తలదించుకునే విధంగా ఓ శాడిస్టు భర్త అత్యంత దుర్మార్గానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్యకు నిద్ర మాత్రలు ఇచ్చి తన మిత్రుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై అత్తకు ఫిర్యాదు చేయగా అంతగా పట్టించుకోవద్దని కొడుకుకే మద్దతు ఇచ్చింది. దిక్కు తోచని స్థితిలో బాధితురాలు సోమవారం రాత్రి కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్తతో పాటు ఆమెపై అత్యాచారినికి పాల్పడిన స్నేహితుడు కూడా పరారీలో ఉన్నాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. పాతబస్తీ అఫీస్‌బాబానగర్‌కు చెందిన మహ్మద్ సలీం (25)కు 2016లో వివాహమైంది. ఉన్నత చదువుల కోసం వివాహం అనంతరం ఆస్ట్రేలియా వెళ్లాడు. అయితే నగరంలో ఉంటున్న తన భార్యతో రోజూ వీడియో కాల్‌తో మాట్లాడుతుండేవాడు. వీరి మధ్య సంభాషణను స్నేహితులకు పంపించి ఆనందించేవాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం స్వదేశానికి వచ్చిన సలీం భార్యకు నిద్రమాత్రలు ఇచ్చి తన మిత్రుడు చాంద్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయంపై  బాధితురాలు అత్తకు తన గోడు వెళ్ల బోసుకుంది. అయితే ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దని, బయటి దేశంలో ఇదంతా కామన్‌గా ఉంటుందని ఆమె కొడుకును వెనకేసుకుని వచ్చింది. దీంతో భాదితురాలు దిక్కులేనిస్థితిలో కంచన్‌బాగ్ పోలీసులను ఆశ్రయించింది. బా ధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భర్త సలీంను అరెస్టు చేయగా చాంద్ పరారీలో ఉన్నాడు.