Home జాతీయ వార్తలు ఉపవాసం పాటించలేదని భార్యను పొడిచి భర్త ఆత్మహత్య

ఉపవాసం పాటించలేదని భార్యను పొడిచి భర్త ఆత్మహత్య

                     KNIFE

న్యూఢిల్లీ: కర్వా ఛౌత్ ఉపవాసం పాటించనందుకు ఢిల్లీ కి చెందిన సస్వీందర్ సింగ్(40) తన భార్యను కత్తితో పొడిచేశాడు.  ఆయన భార్య పుట్టింట్లో ఉండగా ఆదివారం రాత్రి ఈ ఘటన  జరిగినట్లు పోలీసులు తెలిపారు. అతడు భార్యను ఇంటి కప్పుపైకి తీసుకెళ్లి అక్కడ ఆమెతో మాట్లాడుతూ వాగ్వివాదానికి దిగి  ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కోపంలో అతడు తన భార్యను కత్తితో పొడిచేసి ఆ తర్వాత నాలుగో అంతస్తు పై కప్పు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు అక్కడికక్కడే చనిపోగా, అతడి భార్య మాత్రం బిఎస్‌ఎ ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఐదేళ్ల క్రితం పెళ్లయిన ఆ దంపతులకు నాలుగేళ్ల కూతురు ఉంది.