Saturday, April 1, 2023

భార్య ఆత్మహత్య చేసుకుంటుండగా భర్త వీడియో తీసి….

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: భార్య ఆత్మహత్య చేసుకుంటుండగా భర్త వీడియో తీసి ఆమె బంధువులకు పంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెంచలయ్య-కొండమ్మ అనే దంపతులు ఆత్మకూరులో నివసిస్తున్నారు. భార్య ఆత్మహత్య చేసుకునేటప్పుడు భర్త వీడియో తీశాడు. ఆ వీడియో వాట్సాప్‌లో ఆమె బంధువులకు పంపించాడు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పెంచలయ్యను అరెస్టు చేశారు. పెంచలయ్య వేధింపులతో తన కూతురు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News