Saturday, April 1, 2023

క్రైం ఫ్రీ ఏరియాగా హుస్సేన్ సాగర్

- Advertisement -
- Advertisement -

Hussain Sagar as crime free area

అదనపు భద్రతా సిబ్బంది కేటాయింపు
ఇప్పటి వరకు 285మందిని కాపాడిన పోలీసులు
అభినందించిన నగర సిపి అంజనీకుమార్

హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌ను క్రైం ఫ్రీ ఏరియాగా తీర్చిదిద్దుతున్నామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు శుక్రవారం వచ్చిన ఐదుగురు బాధితులను కాపాడిన లేక్ పోలీసులను నగర సిపి మెమోంటోలు ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకు హుస్సేన్ సాగర్‌కు వచ్చి రిలాక్స్ అవుతారని, రీఫ్రేష్ అయ్యేందుకు ఇక్కడికి వస్తారని అన్నారు.ట్యాంక్‌బండ్‌పై ప్రజలు గుంపులుగా ఉంటారని అన్నారు. వారిభద్రత, ఆత్మహత్య చేసుకునే వారిని కాపాడడం సవాలుతో కూడిన విషయమని అన్నారు.

పోలీసులు ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చే వారిని కాపాడేందుకు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారని తెలిపారు. లేక్ పోలీసులు హుస్సేన్ సాగర్‌ను టూరిస్ట్ ఫ్రెండ్లీగా, క్రైం ఫ్రీ గా మార్చేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఆగస్టు నెలలో లేక్ పోలీసులు 23మందిని కాపాడారని తెలిపారు. ఈ ఏడాది 285మందిని కాపాడారని, 13మంది హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. పలువురిని కాపాడిన లేక్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌స్పెక్టర్ ధనలక్ష్మి, పిసిలు అభిలాష్ యాదవ్, రాజు, నవీన్ కుమార్, హోంగార్డులు కృష్ణ యాదవ్, యాదగిరి, సయిద్, దావుద్, ఇమామ్ భాషా, అశోక్ గౌడ్‌కు మెమోంటో అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News