Home కరీంనగర్ హుజురాబాద్‌లో టిఆర్‌ఎస్‌దే విజయం

హుజురాబాద్‌లో టిఆర్‌ఎస్‌దే విజయం

huzurabad by-election 2021

విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ఓయూ జేఏసీ విద్యార్దులు
ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్న నాయకులు

హైదరాబాద్: త్వరలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో టిఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలంగాణ ఓయూ జేఏసీ విద్యార్ది సంఘం చైర్మన్ తోట్ల స్వామి యాదవ్ పేర్కొన్నారు. సోమవారం విద్యార్ది సంఘం నాయకులు బొల్లు నాగరాజుతో కలిసి బస్సుయాత్ర చేపట్టి స్దానికులకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇప్పటివరకు ప్రజల కోసం చేపట్టిన పథకాలు అభివృద్దిపై కరప్రతాలు పంచుతూ బంగారు తెలంగాణ సిఎం కెసిఆర్‌తో సాధ్యమని, ప్రతిపక్ష పార్టీ నాయకుల అసత్య ప్రచారం నమ్మవద్దని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో అవినీతి పరులను తరిమికొట్టి ప్రజా సంక్షేమం కోసం పాటు పడే నాయకులను ఆదరించాలని కోరారు. ఈప్రచార కార్యక్రమంలో జేఏసీ నాయకులు జింకల పర్వతాలు, జీ.డి. అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.