Thursday, February 2, 2023

హుజూర్‌నగర్‌పై గులాబీ జెండా ఎగురేస్తాం

- Advertisement -

Palla-Rajeshwar-Reddyమనతెలంగాణ/ఎస్‌ఎమ్ రఫీ, హుజూర్‌నగర్ టౌన్ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఈనెల 21న జరగనుంది. గత ఎంఎల్‌ఏ ప్రస్తుత ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక జరగనుండగా టిఆర్‌ఎస్ ఈ ఉప ఎన్నికలో అనుభవజ్ఞుడైన అనేక విజయాలను చేకూర్చి పెట్టిన మండలి చీఫ్ విప్ పల్లా రాజేశ్వరరెడ్డిని ఉప ఎన్నిక ఇన్‌చార్జీగా ముఖ్యమంత్రి కెసిఆర్ నియమించారు. ఈ ప్రాంత ఎమ్మెల్సీగా ఎన్నికై రెండవ సారి విప్‌గా బాధ్యతలు చేపట్టి నియోజకవర్గంలో ఎంతో మంది పార్టీ నేతలతో సంబంధం ఉంది.

ఒక విద్యాసంస్థ్ధ చైర్మన్‌గా వేలాది మంది విద్యార్థ్ధులు, ఉపాధ్యాయులతో సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తిగా ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ్ధ శానంపూడి సైదిరెడ్డిని గెలిపించడానికి స్థానికంగా ఉంటూ పార్టీ ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర అనుబంధ సంఘాల సంస్థ్ధల చైర్మన్‌లు, సీనియర్ నేతలతో పార్టీ ప్రచార కార్యక్రమాలను ఎప్నటికప్పుడు సమన్వయం చేస్తూ వ్యూహాలు రూపొందిస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డితో ‘మన తెలంగాణ’ ఎన్నికల ప్రత్యేక ఇంటర్వూ…

1. పార్టీ ఉప ఎన్నిక నియోజకవర్గ ఇన్‌చార్జీగా మిమ్మల్ని నియమించడం పై మీ అభిప్రాయం , అభ్యర్థి గెలుపు కోసం ఎలా కృషి చేస్తున్నారు?
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతలు నాకు అప్పగించిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌కు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ హుజూర్‌నగర్ పరిధి గల ఎంఎల్‌సిగా ఉన్నాను. గతంలో పాలేరు ఉప ఎన్నికల్లోనూ, 2018 ఎమ్మెల్యే ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నాయకత్వంలో అక్కడ గెలుపునకు కృషి చేశాను. తర్వాత ఖమ్మం మున్సిపాలిటీ స్టేషన్‌ఘన్‌పూర్, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇన్‌చార్జీగా పనిచేసిన అనుభవం ఉండటం ఈ ప్రాంతంలో నాపూర్వ విద్యార్థ్ధులు, లెక్చరర్‌లు ఉన్నారు. వారి సహకారం, స్థానిక నాయకులను సమన్వయం చేస్తూ ముందుకు పోతున్నాం.

2. నియోజకవర్గంలో పార్టీ బలం ఎలా ఉంది. క్యాడర్‌ను ఎలా ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు?
2018 ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో పార్టీ బలహీనంగా ఉంది. ఎన్నికల అనంతరం జరిగిన స్థ్ధానిక సంస్థ్ధల ఎన్నికల్లో మెజార్టీ జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌లు గెలిచాం. అంతేకాకుండా సీఎం అభివృద్ధి పథకాలతో అనేక మంది ఆకర్షితులై పార్టీలో చేరడంతో మాబలం ఇంకా పెరిగింది. మా ప్రధాన పోటీ దారు వర్గ పోరుతో సతమతమౌతుంది. దీనితో ఈసారి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం.

3. టిఆర్‌ఎస్ పార్టీకి ఎన్నికల్లో సిపిఐ మద్దతుపై మీ స్పందన?
ఉద్యమ కాలంలో సిపిఐ పార్టీతో కలిసి పనిచేశాం. గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సిపిఐ మిత్రపక్షంగా ఉంది. సిపిఐ మద్దతు తెలపడంతో మాబలం మరింత పెరిగి మెజార్టీతో మాఅభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుస్తాడని భావిస్తున్నాం.

4. మహిళా ఓట్లు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి. వారి నుండి స్పందన ఎలా ఉంది?
ఎన్నికల్లో పోటీ అనేది పార్టీల మధ్య ఉంటుంది. అభ్యర్థ్ధులు ఎవరు అనేది, ప్రధానం కాదు. ఒకవేళ మహిళలపై కాంగ్రెస్‌కు ప్రేమ ఉంటే 2014 ఎన్నికల్లో అమరుడి తల్లి శంకరమ్మపై కాంగ్రెస్ అభ్యర్థి ఎలా గెలుపొందారు. అలాగే టిడిపి అభ్యర్థి మహిళే కదా, ఓటర్లు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తారు. మహిళలకు ఎన్నో పధకాలు ఇచ్చాం వారి ఓట్లు మాకే వేస్తారనే నమ్మకం మాకుంది.

5. ఉప ఎన్నికల్లో ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు?
ఉప ఎన్నికల్లో సుమారు 50 వేలకు పైగా మెజార్టీతో గెలిచి తీరుతాం. ఉత్తమ్ స్థ్ధానిక నేతలకు టిక్కెట్ ఇవ్వకుండా తన భార్యకే టిక్కెట్ ఇవ్వడం స్థానిక క్యాడర్‌లో అసంతృప్తి ఉంది. మా అభ్యర్థ్ధి స్థానికుడు, విద్యావంతుడు అంతేకాకుండా గత ఎన్నికలో ఓడిపోయిన స్థ్ధానికంగా ప్రజలతో మమేకమై ప్రభుత్వం ద్వారా అనేక అభివృద్ధ్ది కార్యక్రమాలు చేశారు. ప్రతిపక్షాలకు ఓటమి తప్పదు.

Huzurnagar By Election 2019

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles