Saturday, April 20, 2024

హుజూర్‌నగర్ ప్రాంతవాసుల కల రెవెన్యూ డివిజన్: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Huzurnagar Revenue division form by telangana govt

సూర్యాపేట: హుజూర్‌నగర్ ప్రాంతవాసుల కల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు. హుజూర్‌నగర్ ఆర్‌డిఒ కార్యాలయం, ఆర్బన్ పార్క్, నేషనల్ అకాడమీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశం మొత్తం సిఎం కెసిఆర్ దార్శనికతను ముందు చూపును చూస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపలల్ శాఖ మంత్రి కెటిఆర్ నాయకత్వంలో మున్సిపాలిటీలు సుందరంగా తయారవుతున్నాయన్నారు. కరోనా సంక్షోభంలో కూడా సిఎం కెసిఆర్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు. 24 గంటల ఉచిత విద్యుత్‌తో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి లింగయ్య యాదవ్, జడ్‌పి చైర్‌పర్సన్ దీపికా, ఎంఎల్‌ఎలు సైదిరెడ్డి, కిశోర్, చిరుమర్తి లింగయ్య, మల్లయ్య యాదవ్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News