Thursday, March 28, 2024

నగరంలో ఫ్లైఓవర్లు మూసివేత

- Advertisement -
- Advertisement -
జగినేకి రాత్‌కు ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad All Flyovers closed for jagne ki raat

హైదరాబాద్: నగరంలో సాహెబ్ ఈ మిరాజ్ జగినే కి రాత్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 11, అర్ధరాత్రి నుంచి 12వ తేదీ ఉదయం వరకు నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు తెలిపారు. నెక్లెస్ రోడ్డును రాత్రి 10గంటల తర్వాత మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రీన్‌ల్యాండ్ ఫ్లైఓవర్, పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, లంగర్ హౌస్ ఫ్లైఓవర్‌కు మినహాయింపు ఉందని తెలిపారు. నగర వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో ప్రయాణించాలని కోరారు.

Hyderabad All Flyovers closed for jagne ki raat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News