గతేడాదితో పోలిస్తే క్యూ3లో 69 శాతం వృద్ధి
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన తాన్లా ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ క్యూ3 (అక్టోబర్-డిసెంబర్) ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. కంపెనీ నికర లాభం రూ.158 కోట్లతో 69 శాతం వృద్ధిని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22) మూడో త్రైమాసికంలో తాన్లా ఆదాయం రూ.885 కోట్లతో 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. 9 నెలల ఆదాయంలో రూ.2,352 కోట్లతో 39 శాతం వృద్ధి ఉంది. ఇక క్యూ3లో ఎబిటా రూ.2,02 కోట్లతో 60 శాతం పెరిగింది. వార్షికంగా ఎబిటా 23 శాతం మెరుగైంది. కంపెనీ ఫౌండర్ చైర్మన్, సిఇఒ ఉదయ్ రెడ్డీ మాట్లాడుతూ, 22 త్రైమాసికాలుగా తాన్లా వార్షిక వృద్ధిని నమోదు చేస్తోందని, ఈ జోరును కొనసాగిస్తుందని విశ్వాసంతో ఉన్నామని అన్నారు.
Hyderabad-based Tanla Q3 net profit at Rs 158 cr