Wednesday, April 24, 2024

హైదరాబాద్ దక్షిణ భారత న్యూయార్క్

- Advertisement -
- Advertisement -

దేశంలో నివాసయోగ్యమైన అత్యుత్తమ నగరంగా భాగ్యనగరికి ప్రథమస్థానం
మంత్రి కెటిఆర్‌కు అభినందనల వెల్లువ

మనతెలంగాణ/హైదరాబాద్: ఉత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచింది. దేశంలో నివాసయోగ్యమైన, ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్ అత్యత్తమమైన నగరంగా ప్రథమ స్థానంలో నిలిచింది. హాలిడిఫై డాట్‌కామ్ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు హైదరాబాద్ ఉత్తమ నగరంగా ఎంపికయ్యింది. ఆయా సర్వేలు అంతర్జాతీయ స్థాయినైనా, జాతీయ స్థాయిలోనైనా అగ్రశ్రేణి స్థానంలో నిలవడం హైదరాబాద్‌కు అలవాటైందనడంలో అతిశయోక్తి కాదు. ప్రపంచలో కెల్లా ప్రథమ స్థానంలో అత్యంత విశిష్ట నగరంగా నిలిపిన జెఎల్‌ఎల్ సూచిక 2020 సర్వేలో ఈ ముత్యాల నగరం, అన్ని నగరాల్లో కెల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. నివాసయోగ్యం, వృత్తి ఉపాధి నిర్వహణ అంశాలపైనే ఈ సర్వే కొనసాగింది. ఈ సైట్ ప్రధానంగా పర్యాటకులు, తమ ప్రాధాన్యతలపై గమ్యస్థానాలను ఎంపిక చేసుకోవడానికి ఇబ్బందులు లేకుండా చేయడంలో తోడ్పడుతుంది. దేశంలోని అత్యత్తమ నివాసయోగ్య నగరంగా ఎంపిక చేయడంలో సాంస్కృతిక సమ్మేళనం ప్రాతిపదికన రూపుదిద్దుకున్న నగరాలపై ఈ సర్వే చేశారు. ఆయానగరాల్లో పటిష్టమైన అవకాశాలు, సదుపాయాలు, చక్కని రీతిలో ఆర్థిక ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాలతో సదరు సర్వే కొనసాగింది.

మిగతా నాలుగు స్థానాల్లో ముంబై, పుణె, చెన్నై, బెంగళూరు
ఈ మేరకు సాగిన సర్వేలో అయిదింట నాలుగు స్థాయిలను ముంబై, పుణే, చెన్నయ్, బెంగళూరు నగరాలను, నిజాంలు నిర్మించిన హైదరాబాద్ అధిగమించింది. ఈ సర్వేలో వెల్లడైన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. సెప్టెంబర్ నెల నుంచి మార్చి నెల వరకు హైదరాబాద్‌లో పర్యటించడానికి విశిష్టమైన కాలంగా రుజువయ్యింది. ఇక్కడి పర్యాటక కేంద్రాల్లో చరిత్రాత్మక చార్మినార్, గోల్కొండ కోట స్వప్నం సాకారమైనట్టుగా రూపుదాల్చిన రామోజీ ఫిల్మ్ సిటీ మొదలైనవి పర్యాటకుల దృష్టిని ఆకర్శిస్తున్నాయని ఈ సర్వేలో తేటతెల్లమయ్యింది. ఈ సర్వే ఫలితాల ఆధారంగా పర్యాటకులు అధిక సంఖ్యలో నగరాన్ని సందర్శించేందుకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ నగరం శరవేగంగా దక్షిణ భారత న్యూయార్క్ నగరంగా అభివృద్ధి చెందుతోందని, ఈ సర్వేలో వెల్లడయ్యింది. ఆయా అంశాల ప్రాతిపదికపై ఇప్పటివరకు జరిగిన పలు సర్వేల్లో హైదరాబాద్ ప్రథమ స్థానాన్ని పొందింది. వివిధ సంస్థలు పలు దశల్లో జరిపిన సర్వేల్లో ఈ వాస్తవం వెల్లడయ్యింది. 2020 సంవత్సరంలో విశిష్ట నగరాల ఎంపికపై జరిగిన సర్వేలో హైదరాబాద్ నగరం మొదటి స్థానం పొందడం తో పాటు ఖండాంతరాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులను ఆకర్షించే నగరంగా గుర్తింపు పొందింది.

Hyderabad best city for live and work in India: Survey

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News