Home తాజా వార్తలు ట్రాఫిక్ చలాన్లలో సెంచరీ కొట్టిన కారు!

ట్రాఫిక్ చలాన్లలో సెంచరీ కొట్టిన కారు!

Traffic Challanహైదరాబాద్: ఒక వాహనంపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 105 చలాన్లు ఉండడం ట్రాఫిక్ పోలీసులను విస్తుపోయేలా చేసింది. ఓ కారు గచ్చిబౌలిలో నో పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి ఉండటం గమనించిన పోలీసులు ఆ వాహనంపై ఉన్న చలాన్లను చెక్ చేసి చూసి షాక్ అయ్యారు. మొత్తం 105 ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాటి మొత్తం రూ. 17, 805గా లెక్క తేల్చారు. దాంతో పోలీసులు ఆ కారును సీజ్ చేసి డ్రైవర్ పై చార్జీషీట్ నమోదు చేశారు. చలాన్లు చెల్లించి కారు తీసుకెళ్లాలని సూచించారు.

Hyderabad Cab Owes Rs 17,805 Traffic Challan