Home హైదరాబాద్ కంపు మార్కెట్లు

కంపు మార్కెట్లు

  •  చెత్త కుప్పలుగా మారిన మార్కెట్ యార్డులు
  •  కనీస సౌకర్యాలు కరువు
  • ఎక్కడ చూసినా మురికి కంపే
  • పట్టించుకోని అధికారులు

Markets-Dump-Yard

సిటీ బ్యూరో : వర్షం పడితే చాలు అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి. మూత్రశాలల ఉన్నా అందులోకి వెళ్ళలేని స్థితి. మంచి నీటి నల్లాల్లో చుక్క నీరు రాదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేస్తాం అని చెప్పిన హామీలు కాగితాలకే పరిమితం. గుట్టలు గుట్టలుగా పేరుకు పోయిన చెత్తా చెదారం. ఇవి విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్ మహానగరంలోని మార్కెట్ యార్డులు, రైతు బజార్ల దుస్థితి. పాలకులు మాటలతోనే కోట కట్టడం లాంటి ఆర్భాటపు ప్రకటనలు తప్పా అవి ఆచరణలో అమలు కావడం లేదు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నగరంలోని ప్రతి 10 వేల జనాభాకు ఒక మార్కెట్ అవసరం అని దీనిని త్వరలో కార్యచరణలోతీసుకు వస్తామని ప్రకటించి అప్పుడే ఏడాదిన్నర గడిచిపోయింది. అయితే అది కాస్తా కాగితాలకే పరిమితం కాగా, మార్కెట్లలో మాత్రం కనీసం సౌకర్యాలు కూడా కల్పించ లేకపోకపోయ్యారు. దీంతో గ్రేటర్ పరిధిలోని గుడిమల్కాపూర్, గడ్డిఅన్నారం, భరత్‌నగర్‌లలో హోల్‌సేల్ మార్కెట్లతో పాటు 11 రైతు బజార్ల సమస్యలకు నిలయంగా మారాయి. గ్రామాల నుంచి కూరగాయలను విక్రయించుకునేందుకు వస్తున్న రైతులు, కొనుగోలు దారులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లతో పాటు రైతు బజార్‌లోనూ పార్కింగ్ రవాణా వంటి సౌకర్యాలు ప్రతి చోట ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మార్కెట్‌లలో కల్పించాల్సిన సౌకర్యాలపై ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు పంపుతున్నా పనులు మాత్రం జరగడం లేదు. దశబ్దదాల కాలంగా ప్రభుత్వాలు, పాలక మండళ్లుతో పాటు మార్కెటింగ్ శాఖలో పని చేస్తున్న అధికారులు మారుతున్నా మార్కెట్ కనీస సౌకర్యాల కల్పన రోజు రోజుకు దిగజారి పోతున్నాయి తప్పిస్తే మెరుగు పడడం లేదు. దీంతో ప్రభుత్వతాలు మారినప్పుడల్ల మార్కెట్లను అభివృదద్ధ్ది చేస్తామని మాటలు చెప్పే వారు తప్పా అక్కడ సౌకర్యాలు కల్పించే వారు కరువయ్యారు. గుడి మల్కాపూర్ మార్కెట్లో మంచినీటి వసతి, మరుగుదొడ్లు లేవు. చెత్త తొలగించే వారే కరవయ్యారు. వర్షం వచ్చిందంటే మార్కెట్‌లలో నడవలేని పరిస్థితి నెలకొంది. గడ్డిఅన్నారంలో పండ్ల మార్కెట్, ఎన్టీఆర్‌నగర్‌లో కూరగాయల మార్కెట్‌లోనూ పరిస్థితుల ఇదే విధంగా ఉన్నాయి.బోయిన్‌పల్లి హోల్‌సేల్ మార్కెట్ యార్డు మినహా ఎక్కడ చూసినా మౌళిక సౌకర్యాల కొరత తీవ్రంగానే ఉంది. ప్రస్తుతం నగరంలోని హొల్‌సేల్, రైతు బజార్‌లను యుద్ధ్దప్రాతిపదికన అభివృద్ధ్ది చేయాల్సి ఉందని రైతులు, వినియోగ దారులు అభిప్రాయపడుతున్నారు.