Thursday, April 25, 2024

మొహరంపై నగర సిపి సమీక్ష

- Advertisement -
- Advertisement -

Hyderabad CP Anjani kumar review on Muharram

హైదరాబాద్: మొహరం బందోబస్తు ఏర్పాట్లపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సమావేశంలో నిర్వహించారు. నగరంలో గురువారం నిర్వహించనున్న మొహరంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, ఎసిపిలు, డిసిపిలతో సిపి అంజనీకుమార్ మాట్లాడారు. భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. సమావేశంలో జాయింట్ సిపిలు విశ్వప్రసాద్, ఎఆర్ శ్రీనివాస్, రమేష్ రెడ్డి, డిసిపిలు కల్మేశ్వర్, గజారావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

Hyderabad CP Anjani kumar review on Muharram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News