Home స్కోర్ హైదరాబాద్ ఫుట్‌బాల్ లీగ్‌కు సర్వం సిద్ధం

హైదరాబాద్ ఫుట్‌బాల్ లీగ్‌కు సర్వం సిద్ధం

kabaddi

26 నుంచి మూడో సీజన్,
బరిలో 12జట్లు
లీగ్ మెంటర్‌గా బైచుంగ్ భూటియా

హైదరాబాద్: అభిమానులు ఎంతో అతృతగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ ఫుట్‌బాల్ లీగ్  (హెచ్‌ఎఫ్‌ఎల్) పోటీలు నవంబర్ 26 నుంచి జరుగనున్నా యి. దాదాపు పది వారాల పాటు కొనసాగ ఈ లీగ్‌లో 12 జట్లు పోటీ పడనున్నాయి. ఫైనల్ పోరు వచ్చే ఏడాది జనవరి 27న జరుగుతుంది. లీగ్‌కు సంబంధించిన వివరాలను హెచ్‌ఎఫ్‌ఎల్ చైర్మన్ మురాద్ జసాని, లీగ్ డెరెక్టర్లు అదిల్ మిస్త్రీ, నవీద్ కెశ్వానిలు వెల్లడించారు. ఈ సమావేశంలో హెచ్‌ఎఫ్‌ఎల్ లీగ్ మెంటర్, భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా కూడా పాల్గొన్నారు. అ నంతరం లీగ్‌కు సంబంధించిన జెర్సీలను భుటియా ఆవిష్కరించారు. దేశంలో ఫుట్‌బాల్‌కు మరింత ఆదరణ క ల్పించాలని, కొత్త ఆటగాళ్లకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ లీగ్‌ను ప్రారంభించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సీజన్‌లో హెచ్‌ఎఫ్‌ఎల్ మెంటర్‌గా భుటియా వ్యవహరిస్తారని వారు వెల్లడించారు. భుటియా వంటి దిగ్గజం తమతో కలిసి ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ లీగ్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఈ లీగ్‌లో మొత్తం 135 మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపారు. విజేతగా నిలిచే జట్టుకు మూడు లక్షల రూపాయల నగదు పురస్కారం అందిస్తామని పేర్కొన్నారు. రన్నరప్ జట్టుకు 1.5 లక్షల రూపాయలు అందిస్తామని తెలిపారు. అంతేగాక లీగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచ ఆటగాళ్లకు రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు కూడా యూట్యూబ్ ప్రత్యేక ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు. ఈ లీగ్ వల్ల యువ ఆటగాళ్లకు ఎం తో ప్రయోజనం కలుగుతుందన్నారు. హైదరాబాద్‌లోని ఔత్సాహిక ఫుట్‌బాల్ ఆటగాళ్లు తమ ప్రదర్శన నిరూపించేందుకు ఈ లీగ్ ఓ వేదికగా నిలుస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి ఆటగాడు భుటియా మెంటర్‌గా ఉండడం వల్ల యువ ఆటగాళ్లు తమ ఆటను మెరుగు పరుచుకునేందుకు ఎంతో దోహదం చేస్తుందన్నారు. తాము ఇప్పటికే రెండు లీగ్‌లను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ లీగ్ మూడోదని, దీన్ని కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ లీగ్ కోసం మొత్తం ఆరు మైదానాలను సిద్ధం చేసినట్టు వివరించారు. 6ఎ సైట్ మైదానాలను లీగ్‌లో పాల్గొంటున్న 12 జట్లు తమ హోం గ్రౌండ్‌లుగా ఉపయోగించుకోనున్నాయని వివరించారు. ఈ లీగ్‌లో పాల్గొనేందుకు చాలా మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని, వీరిలో ప్రతిభావంతులను గుర్తించి ఆయా జట్ల తరపున బరిలోకి దించుతామని వెల్లడించారు. కాగా ప్రతి జట్టులో హైదరాబాద్‌లోని వివిధ ఎ డివిజన్లకు ఆడిన నలుగురు ప్రొఫెషనల్ ఆటగాళ్లు ఉం టారని, అదే విధంగా ఔత్సాహిక ఆటగాళ్లకు కూడా ఆ యా జట్లలో చోటు కల్పిస్తామని వివరించారు. భారత్‌లోని ప్రముఖ ఫుట్‌బాల్ జట్లు మోహన్‌బగాన్, మహీంద్ర యునైటెడ్, ముంబయి ఎఫ్‌సిలలో ఆడిన ఆటగాళ్లు కూడా ఈ లీగ్‌లో బరిలోకి దిగుతున్నారని వారు తెలిపారు. అనంత రం వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహించనున్న ఆటగాళ్లను నిర్వాహకులు మీడియాకు పరిచయం చేశారు. అంతేగాక లీగ్‌కు సంబంధించిన జెర్సీలను కూడా ఆవిష్కరించారు.