Thursday, April 25, 2024

కరోనా టెస్టుల్లో హైదరాబాద్ ముందు వరుస

- Advertisement -
- Advertisement -

Hyderabad front row in corona tests in Telangana

హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విజృంభణ చేయకుండా వైద్యశాఖ త్వరగా రోగులను గుర్తించేందుకు టెస్టులు పెద్ద చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో నిర్వహించే పరీక్షల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. మార్చి 2న నగరంలో మొదటి పాజిటివ్ కేసులు బయటపడింది.దీంతో అధికారులు అప్రమత్తమైన వ్యాధి లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించింది. కానీ మే,జూన్ నెలల్లో వైరస్ విశ్వరూపం దాల్చి రోజుకు వందలాది కేసులు నమోదు కావడంతో వెంటనే ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టులు నిర్వహించి ఆరగంటలోనే వ్యాధి నిర్దారణ చేసేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో జూలై 8వ తేదీ నుంచి 94పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 14 ప్రభుత్వం ఆసుపత్రుల్లో టెస్టులు చేసేందుకు కిట్లను ఆయా కేంద్రాలకు సరఫ-రా చేసి రోజుకు 25మందికి టెస్టులు చేసి వెంటనే ఫలితాలు వెల్లడించేవారు.

ఉచితంగా ర్యాపిడ్ టెస్టులు చేయడంతో నగర ప్రజలు దగ్గు,జ్వరం, జలుబు లక్షణాలున్న వారంతా పట్టణ ఆరోగ్యకేంద్రాల వద్ద క్యూలో నిలబడి వ్యాధి నిర్దారణ చేస్తుకున్నారు. జిల్లా పరిధిలో రోజుకు 5500 ప్రభుత్వం చేయాలని ఆదేశిస్తే జిల్లా వైద్య సిబ్బంది 7500మందికి పరీక్షలు నిర్వహించి ముందువరుసలో నిలిచారు. 3,54,310 మందికి ర్యాపిడ్ టెస్టులు, ఆర్‌టిపిఆర్ పరీక్షల ద్వారా 42వేల మందికి టెస్టులు చేసినట్లు, ఆగస్టు నెలల్లో అత్యధికంగా 1,50,630 టెస్టులు చేసినట్లు అధికారులు గణాంకాలు వెల్లడిస్తున్నారు. మార్చి నుంచి నేటివరకు 58,120 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, ఇందులో జూలైలో 26,082 కేసులు బయటపడట్లు వైద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఆగస్టులో రోజుకు 450లోపు నమోదైయ్యాయని, సెప్టెంబర్ మాసంలో తగ్గి రోజుకు 310లోపు పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వివరిస్తున్నారు.దసరా లోపు 150 లోపే కేసులు కావచ్చని, మూడు నెలల నుంచి నగర ప్రజలు కరోనా సోకిన వ్యక్తిని కలిసితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్టులు చేయించుకుని వ్యాధి తీవత్ర కాకముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారని,దీంతో కరోనా తగ్గుముఖం పట్టిందని చెబుతున్నారు. ప్రజలు నెల రోజుల పాటు జాగ్రత్తలు పాటిస్తే వైరస్ తీవత్ర తగ్గుతుందని, తరువాత సోకిన ఎక్కవ ప్రభావం చూపదని, వైద్యుల సలహాలు పాటించి ఆరోగ్యం కాపాడుకోవాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Hyderabad front row in corona tests in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News