Home తాజా వార్తలు మక్కాలో హైదరాబాద్ హజ్ యాత్రికురాలు మృతి

మక్కాలో హైదరాబాద్ హజ్ యాత్రికురాలు మృతి

మనతెలంగాణ/హైదరాబాద్: హజ్ యాత్రకు బయలుదేరిన హైదరాబాద్ జిల్లా ఆసిఫ్‌నగర్ ప్రాంతానికి చెందిన హజ్ యాత్రికురాలు లతిఫ్-ఉన్-నిసా(52) శనివారం ఉదయం గుండేపోటు రావడంతో మక్కాలో మృతి చెందినట్లు రాష్ట్ర హజ్ కమిటీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. శ్వాస సంబంధిత ఆనారోగ్య సమస్యల మూలంగా ఆమెను మక్కాలోని ఆసుపత్రిలో చెర్పించారు. మెరుగైన చికిత్స అందించిన ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె భర్త ముస్తాఫా, కుమారుడు ఖలీల్ తో కలిసి హజ్ యాత్రకు బయలుదేరి వెళ్ళారు.

Hyderabad Haj pilgrim died in Makkah