Friday, April 26, 2024

నగరవాసుల కోసం మెట్రో బజార్‌ను ప్రారంభించిన మెట్రో రైల్

- Advertisement -
- Advertisement -

Hyderabad Metro launched Metro Bazaar

 

హైదరాబాద్: ప్రయాణీకులతో తమ బంధాన్ని మరింత శక్తివంతం చేసే కార్యక్రమాలలో భాగంగా ఎల్ అండ్‌టీ మెట్రో విన్నూతమైన మెట్రో బజార్ షాపింగ్ ఆన్ ద గోతో వచ్చింది. మెట్రో ప్రయాణీకులకు అనుభవ పూర్వక షాపింగ్ అనుభవాలను ఇది అందించనుంది. మెట్రో బజార్‌ను బుధవారం అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అదనపు డిజిపీ స్వాతి లక్రా ప్రారంభించారు. ప్లియా మార్కెట్ రూపంలో మెట్రో బజార్‌ను నిర్వహిస్తున్నారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో కాన్‌కోర్స్ లెవల్ వద్ద 15 జూన్ 2022 నుంచి 15 రోజుల పాటు ఇది జరుగుతుంది. అప్పెరల్, అర్ట్‌వర్క్, హెర్బల్ ఉత్పత్తులు వంటి వాటిని ఇక్కడ 14 కియోస్క్‌లలో విక్రయిస్తున్నారు.

ఈసందర్బంగా స్వాతిలక్రా మాట్లాడుతూ లింగ సమానత్వం, మహిళా సాధికారతతను ఈరీతిలో బారీగా మెట్రో రైల్ ప్రోత్సహించడం సంతోషంగా ఉందని, మహిళా వ్యవస్దాపకతను ప్రోత్సహించడంపై హెచ్‌ఎంఆర్ లక్ష్యానికి అత్యుత్తమ ఉదాహరణగా మెట్రో బజార్ నిలుస్తుందన్నారు. ఈతరహా కార్యక్రమాలు తమ జీవితంలో ఏదైనా చేయాలని తపించే మహిళలను ప్రోత్సహించడం, వారికి తగిన మార్గాలను అందించడంలో సుదూరం వెళ్తాయి. మెట్రో బజార్‌కు అభినందనలు తెలిపారు. ఇక్కడ అందుబాటులో ధరల్లోఅందిస్తోన్న ఉత్పత్తులను మెట్రో ప్రయాణీకులకు ఇష్టపడుగలరని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి,ఎల్‌అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ సీఈఓ కెవీబీరెడ్డి, ఉమెన్విజన్ ఫౌండర్ డైరెక్టర్ ప్రవీణ తోట నాయుడు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News