Home తాజా వార్తలు వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

Hyderabad police raids on brothel house in old city

 

హైదరాబాద్: గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ ఘటన నగరంలోని పాతబస్తీ కాలపత్తర్ పోలీసు స్టేషన్ పరిధిలోని నవాబ్ సాబ్ కుంట బషారత్ లో చోటు చేసుకుంది. నగరంలో గత కొన్ని రోజులగా భార్య భర్తలే ఈ వ్యభిచార గృహన్ని గుట్టు చప్పుడు కాకుండ నిర్వహిస్తున్నారు. ఈ దాడిలో ఇద్దరు నిర్వహకులతో పాటు, ఒక విటుడు, ఏడుగురు బాధిత మహిళలను అదుపులోకి తీసుకొని, వారి నుంచి 32 వేల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బాధిత మహిళల్లో ఇద్దరు పశ్చిమ బెంగాల్, ఒకరు కర్నాటకకు చెందినవారు. మిగిలిన వారు పాతబస్తీకి చెందిన వారిగా గుర్తించారు. ఈ మేరకు నిర్వహితులు, విటుడిపై కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Hyderabad police raids on brothel house in old city