Home తాజా వార్తలు బెంగళూరుకు బెంగ పుట్టేలా దూసుకుపోతున్నాం

బెంగళూరుకు బెంగ పుట్టేలా దూసుకుపోతున్నాం

 IT sector

 

ఐటి రంగంలో హైదరాబాద్ అప్రతిహత ప్రగతి

ఇంటెల్ డిజైన్ అండ్ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్

ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్‌లో నాలుగు లక్షల ఉద్యోగాలు లక్ష్యం

మాదాపూర్ : ఐటి రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోందని ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. సోమవారం రాయదుర్గంలోని ఇంటెల్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సెంటర్‌ను ఐటి సెక్రటరీ జయేష్ రంజన్, ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజాతో కలిసి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కెటిఆర్ మాట్లాడారు. ఐటి రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోందని పేర్కొన్నారు. బెంగళూరు తర్వాత రెండో సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం జరిగిందని చెప్పారు. దాదాపు 1500 మంది ఉద్యోగులు పని చేసే సామర్థంతో సెంటర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన తెలిపారు. ఐటి రంగం అభివృద్ధికి జయేష్ రంజన్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.

ఐటి రంగంలో హైదరాబాద్ దూసుకుపోవడంతో పాటు ఎలక్ట్రానిక్స్ మానిఫ్యాక్చరింగ్ రంగంలో వచ్చే నాలుగేళ్లలో మూడు లక్షల ఉద్యోగాలు సృష్టించాలని లక్షంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. ఏప్రిల్‌లో టీ వర్క్ ఆవిష్కరిస్తామని స్పష్టం చేశారు. సాఫ్ట్‌వేర్ ఇండస్టీ అంటే భారతదేశంలో అందరికి గుర్తొచ్చేది హైదరాబాద్ నగరమని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరంలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ఇంటెల్ ఇండియా సిద్ధం కావడం మెచ్చుకోదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే కొత్త డిజైన్, ఇంజనీరింగ్ సెంటర్‌ని హైదరాబాద్‌లో మొదలుపెట్టిందన్నారు. సాంకేతికత , ఉత్పత్తి సృజనాత్మక పనిలో హైదరాబాద్ అందరికి గమ్యస్థానంలా మారిందని కెటిఆర్ వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయన్నారు. విభిన్న రంగాలకు చెందిన కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయన్నారు.

అందుకు కారణం ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన వాతావరణం ఉందన్నారు. ఇప్పడు ఇంటెల్ కూడా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్దమైందన్నారు. ఇంటెల్ ప్రపంచ స్థాయి డిజైన్, ఇంజనీరింగ్ సెంటర్ రాబోయే రోజుల్లో సరికొత్త టెక్నాలజీకి మరింత ఇవ్వనుందన్నారు. ఎస్‌ఒసీలు, గ్రాఫిక్స్, హర్డ్‌వెర్ ప్లాట్ ఫామ్సీ,సాఫ్ట్‌వేర్‌లలో క్లిష్టమైన ప్రపంచ ఉత్పత్తులు, సాంకేతికతలకు గణనీయమైన కృషి చేస్తుందన్నారు. ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చీఫ్ ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్చర్ జిఎం రాజా ఎమ్ కోడూరి మాట్లాడా రు.

గత 50 ఏళ్లలో ఇంటెల్ మిలియన్ల మందికి అపారమైన శక్తి ని అందించిందన్నారు. దీని వల్ల మనం జీవించే, పనిచేసే వి ధానం మారుతుందని చెప్పారు. . తాము ఇప్పడు కృత్రిమ మే థస్సు పెరుగుదల ద్వారా నడిచే ఎక్పాస్కిల్ కంప్యూటింగ్ కొత్త కంబోకి ప్రవేశిస్తున్నామన్నారు. ఎక్పాస్కిల్ ఉత్తేజకరమైన దృష్టి, టెక్నాలజీ అందరికి చాలా అవసరం అన్నారు. ఈ మిషన్ నడిపించడంతో ఇంటెల్ రూపకల్పన , ఇంజనీరింగ్ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని, సంస్థని ప్రోత్సహించడానికి, సరికొత్త సాంకేతికతలను అందిపుచ్చుకునేందుకు ఈ కొత్త కేంద్రం దోహదంపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Hyderabad progresses in the IT sector