Saturday, April 20, 2024

భానుడి ప్రతాపానికి వాహనాలు బుగ్గిపాలు

- Advertisement -
- Advertisement -

car-fire

 రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
జాగ్రత్తలు పాటించకుంటే వాహనాలు మాడిమసే..
మధ్యాహ్నం దూరప్రయాణాలు చేయొద్దు : నిపుణులు

హైదరాబాద్: ఒక వైపు నగరంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్నాయి. వాటి ప్రభావం మనుషుల మీద కాదు వారు నడిపే వాహనాల మీద కూడా చూపుతున్నాయి. దీంతో రహదారులపై నడిచే వాహనాల్లో ఒక్క సారే మంటలు చెలరేగడం జరుగుతోంది. దాంతో క్షణాల్లో మంటలు రేగి క్షణాల్లో బూడిద అవుతున్నాయి. వాహన డ్రైవర్లు ఏ మాత్రం ఊహించిన విధంగా నగరంలో పలు ప్రాంతాల్లో సంఘటనలు సంభవిస్తున్నాయి. కారు డిజైన్ లోపాలా? ఇంజన్‌లో నిప్పు రవ్వలు ఎగిసి పడ్డాయా? అనే ప్రశ్నలకు సమాధానలు రాబట్టుకునే లోపు మరి కొన్ని వాహనాలు ఈ జాబితాలో చేరిపోతున్నాయి.

ఆ విధంగా వాహనాలు కాలిపోకుండా ఉండాలంటే వేసవిలో ముందస్తు జాగ్రత్తలు తప్పని సరిగా అంటున్నారు ఆటోమోబైల్ ఇంజనీరింగ్ నిపుణులు కార్లలో కొత్త మోడళ్ళు వస్తున్నాయి.ఎంతో ఖరీదైనవి తయారు అవుతున్నాయి. వాటిలో అగ్నిప్రమాదాలు సంభవించుకుండా కొన్ని పరికరాలను అమర్చుతున్నారు. అంతర్గత లోపాలు,సరైన పరిశీలన లేక పోవడంతో కార్లలో మంటలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా వేసివి కాలంలో ఇటువంటి సంఘటనలు అధికంగా నమోదు అవుతున్నాయి. వాహన డ్రైవర్లు తగు జాగ్రత్తలు పాటించక పోవడం, ముఖ్యంగా బ్యాటరీలు చెక్ చేసుకోవడం, విద్యుత్ వైర్లు తనిఖీ చేసుకోక పోవడం, సిలిండర్లకు రక్షణ చర్యలు తీసుకపోవడం వంటి పలు కారణాలతో ఇవి కాలిపోతున్నాయి.

నిపుణులతో మాత్రమే సర్వీసు చేయించాలి

నగరంలో రోజు రోజుకు కార్ల వినియోగం పెరిగి పోతోంది. వాటితో పాటు పుట్టగొడుగుల్లా సర్వీసు సెంటర్లు కూడా వెలుస్తున్నాయి. దీంతో అనేక మంది వాహనదారులు అధీకృత సర్వీసు డీలర్ల వద్ద వాహనాలు సర్వీసులకు ఇవ్వకుండా సాధారణ సర్వీసు సెంటర్లపైపు మొగ్గు చూపుతున్నారు. కార్లను నిపుణులైన వారి వద్దనే సర్వీలు చేయించాలి. ఇంధన మండించే విద్యుత్ ఉపకరణాలకు అనుసంధానం ఉండాలి. స్పార్క్( మంట) ఇంధన సరఫరా పైపులో లోపాలు ఉంటే సమస్యలు వస్తాయి. కారును తుడిచే పాత వస్త్రాలకు తరచు, పెట్రోల్, డీజిల్ అంటుకుంటూ ఉంటాయి. వాటిని శుభ్రం చేయకుండా కారు బోయినెట్‌లో పెట్టడంతో షార్ట్ సర్కూట్ అయ్యి నిప్పు అంటుకుంటుంది.

కొత్త కార్లను కొనుగోలు చేసినప్పుడు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించాలి. కారు సక్రమంగా పని చేయాలంటే మొత్తం 59 అంశాలను పరిశీలించాలి. జాతీయ రహదారులపై వెళ్ళే టప్పుడు వాహన స్పీడు గంటకు 100 కిలో మీటర్లు ఉంటుంది. మితి మీరిన వేగం కారణంగా కూడా కారులో యంత్ర పరికరాలు వేడెక్కుతాయి. అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పుడు, అప్పటికే కారులో ఉండే అంతర్గత లోపాలు బయట పడి కారులో మంటలు చెలరేగుతాయి.

కారు నడిపేటప్పుడు నాలుగు అంశాలను పరిశీలించాలి. ఉష్ణోగ్రత సూచిక కీలకం. ఇది ఎర్ర మార్కు చూపితే వెంటే సరి చేసుకోవాలి. లూబ్రికేట్ అయిల్ రంగు సక్రమంగా ఉందా ? లేదా అనే అంశాలను పరిశీలించాలి. నల్లగా ఉంటే చల్లదనం ఇచ్చే కూలెంట్ పని చేయక పోవచ్చు. ఇక టైర్లు బాగున్నాయా గాలి ఉందా లేదా అని పరిశీలించుకోవాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు 250 కిలో మీటర్ల తర్వాత కొద్ది సేపు ఆపాలి. మిట్ట మధ్యాహ్నం ప్రయాణం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News