Home తాజా వార్తలు మళ్లీ పల్లె బాట

మళ్లీ పల్లె బాట

Hyderabad Tension for Districts with Corona

 

హైదరాబాద్ లాక్‌డౌన్ సంకేతాలు, సెట్ల వాయిదాతో స్వస్థలాలకు వలసజీవులు, విద్యార్థులు
బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద క్రమంగా పెరుగుతున్న రద్దీ
జిహెచ్‌ఎంసి పరిధిలో నిత్యావసరాల కొనుగోళ్లకు జనం బారులు
ముందు జాగ్రత్త పడుతున్న మద్యం ప్రియులు, బ్యాంకుల వద్ద క్యూలు

మన తెలంగాణ/హైదరాబాద్/ చౌటుప్పల్ : జిహెచ్‌ఎంసి పరిధిలో కరోనా వైరస్ కేసు లు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని ప్రభు త్వం సంకేతాలు పంపింది. దీం తో జనం ముందస్తుగా నిత్యవసరాలు కొనుగోలు చే స్తూ జాగ్రత్త పడుతున్నారు. ఈనెల 2న సిఎం కెసిఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమై ఈ మేరకు ని ర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈసారి మరి ంత కఠినంగా లాక్‌డౌన్ విధించే అవకాశం ఉ ందని, ఈక్రమంలో నిత్యవసర వస్తు సామాగ్రి కొనుగోళ్లకు బయటకు వెళ్లడానికి రెండు గంటలు మాత్రమే టైం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. 15 రోజులపాటు లాక్‌డౌన్ అమలు చేయడం ఖాయమని సంకేతాలు అందడంతో నగర వాసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లో ఉందామని భా విస్తున్న వారు ముందు జాగ్రత్తగా సరుకులు తెచ్చి పెట్టుకుంటుండగా ఇక్కడ ఉం డటం తమ వల్ల కాదని భావిస్తున్న వారు సొంతూళ్లకు పయనం అవుతున్నారు.

అ యితే మంద్యం ప్రియులు ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. సిఎం కెసిఆర్ లా క్‌డౌన్ పట్ల సానుకులంగా ఉన్నారనే వార్త లు వెలువడగానే జనం భారీ సంఖ్యలో సూపర్ మార్కెట్ల వైపు మళ్లారు. ముందు జాగ్రత్తగా సరుకులను తెచ్చి స్టాక్ పెట్టుకుంటున్నారు. కొందరు మాత్రం తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. ఇంత కు ముందు విధించిన లాక్‌డౌన్, ఇటీవల హైదరాబాద్‌లో కేసులు పెరుగుతుండటం తో నగరంలో చాలా మంది గత మూడు నెలలుగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇరు కు ఇళ్లలో పిల్లలతో కలిసి ఉండటం ఇబ్బందిగా ఉండటం.. నగరం కంటే పల్లెటూళ్లే సేఫ్ అనే భావనతో చాలా మంది తమ ఊళ్లకు వెళ్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల తాకిడి పెరిగింది. కొంత మందైతే.. కార్లు, బైక్‌లు, ఆటోల్లోనూ ప్రయాణం చేస్తున్నారు. ఇక ఇప్పటికే లాక్‌డౌన్ దెబ్బ రుచి చూసిన మందుబాబులు మరోసారి లాక్‌డౌన్ విధిస్తే ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైన్స్ షాపుల ముందు క్యూ కడుతూ మద్యం స్టాక్ తెచ్చి పెట్టుకుంటున్నారు.

మరోసారి లాక్‌డౌన్ విధిస్తారన్న సంకేతాలు రావడంతో సోమవారం నాడు ఒక్కరోజు రాష్ట్రంలో రూ. 187 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. కాగా నగరంలో స్వయం ఉపాధి పొందే వారు, కూలీ పనులు చేసుకొని బతికే చాలా మంది లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని స్వస్థలాలకు పయనమవుతున్నారు. గతంలో రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌లో వలసకూలీలకు ఆదాయం లేకపోవడం, ఖర్చులు పెరగడంతో జనం ఇబ్బందులు పడ్డారు. మరోసారి లాక్‌డౌన్ విధిస్తే నగరంలో బతుకు దుర్భరం అవుతుందని వలసకూలీలు, నిరుపేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైవేలలో వాహనాల క్యూ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే వార్తలు వెల్లువెత్తుతుండటంతో హైదరాబాద్, -విజయవాడ జాతీయ రహదారిలో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు రాష్ట్రంలోకి ప్రవేశించడానికి సాయంత్రం 7 గంటల వరకే అనుమతి ఉండటంతో బోర్డర్ వద్ద అధికారులు వాహనాలను నిలిపి వేస్తున్నారు. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. రేపటి నుంచి జరగాల్సిన ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, లాసెట్, పిజిఎల్ సెట్, పిఇసెట్, ఎడ్ సెట్ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో లాక్ డౌన్ తప్పదనే భావనతో ప్రజలు స్వరాష్ట్రానికి తరలి వెళుతున్నారు.

పంతంగి టోల్‌గేట్ వద్ద పెరిగిన వాహనాల రద్దీ

మన తెలంగాణ కరోనా భయంతో కష్ట జీవులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను విడిచి తమ సొంతూళ్లకు పయన మయ్యారు. దీంతో మంగళవారం హైదరాబాద్‌విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌గేట్ కు వాహనాల తాకిడి ఎక్కువయింది. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని పట్టణానికి వలస వచ్చిన పేద ప్రజలకు కరోనా విపత్తు కారణంగా చేసేందుకు పని దొరక్క పోవడం.. మరో పక్క హైదరాబాద్‌లో నిత్యం కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతుండడం ప్రజల వెన్నులో వణకు పుట్టిస్తోంది. చేసేందుకు పనిలేక, తినడానికి తిండిలేక, ఇంటి నెలవారీ అద్దె చెల్లించలేక తట్టా బుట్టా సర్దుకుని స్వగ్రామాలకు బయలు దేరారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఇంటి సామాన్లను వాహనాల్లో సర్దుకుని ఎపికి బయలు దేరిన పలు దృశ్యాలు పంతంగి టోల్‌గేట్ వద్ద కనిపించాయి.