Thursday, March 28, 2024

నగరంలో మరోసారి గ్రీన్‌ఛానల్

- Advertisement -
- Advertisement -
Hyderabad Traffic Police create green channel
సికింద్రాబాద్ నుంచి ఆర్‌జిఐ వరకు ఏర్పాటు

హైదరాబాద్: నగర పోలీసులు మరో సారి గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసి తన ఉదారతను చాటుకున్నారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు శనివారం గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి నుంచి 11.58 గంటలకు గుండెను తీసుకుని బయలుదేరిన అంబులెన్స్ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు 12.31 గంటలకు చేరుకుంది. 34.7 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 33 నిమిషాల్లో చేరుకుంది. హైదరాబాద్ పోలీసులు 2021లో 39 సార్లు గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశారు. 2022లో హైదరాబాద్ పోలీసులు రెండు సార్లు ఏర్పాటు చేశారు. అవయవదానానికి ఏర్పాట్లు చేసి పోలీసులు వైద్యులకు సహకరిస్తున్నారు. గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసిన హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు యశోద ఆస్పత్రి వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News