Friday, April 19, 2024

నేను టిఆర్‌ఎస్ రెబల్‌ను కాదు

- Advertisement -
- Advertisement -
I am not a TRS Rebel Says Tummala Nageswara Rao 
రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయి
 పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా
 ఎక్కడ ఉన్నా పార్టీకి విధేయుడిగానే ఉంటా
 ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం : తాను పార్టీలో రెబల్ కాదని, టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేతనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. రాజకీయాల్లో ఇటీవల కాలంలో విలువలు, కట్టుబాట్లు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అదేశిస్తే వచ్చే ఎన్నికల్లో ఎక్కడనుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిరలో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పలు అసక్తికర కామెంట్స్ చేశారు. పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదని.. పార్టీ విధేయతకు కట్టుబడి ఉండాలన్నారు. తాను ఎక్కడ ఉన్నా పార్టీ విధేయతగా పనిచేస్తానని మీరు కూడా అదేవిధంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. తాను పార్టీకి నష్టం చేసే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో కెసిఆర్ పాలన సంక్షేమ పాలన అని, కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారని ఆయన అన్నారు.

రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం అని సగర్వంగా చెప్పుకునే విధంగా అనేక సంస్కరణలు తీసుకోచ్చారన్నారు. ఆత్మీయ సమావేశం అయినా.. అసమ్మతి సమావేశం అయినా.. పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. గతంలో తాను వెళ్లిన ప్రతి చోట మాకు రోడ్డు కావాలి.. నీళ్ళు కావాలి అని అభివృద్ధి గురించి అడిగే వారు అని.. ఇప్పుడు తాను ఎక్కడికి వెళ్లినా మముల్ని ఎవ్వరూ పట్టించుకోవడంలేదని, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడంలేదని కార్యకర్తలంటున్నారని అన్నారు. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు ఆయన అన్నారు. కాగా, ఈ ఆత్మయ సమావేశంలో మాజీ ఎంపి పొంగులేటి వర్గీయులు కూడా పాల్గొనడం గమనర్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News