Home అంతర్జాతీయ వార్తలు ఆయన ప్రేమను భరించలేను… విడాకులు ఇప్పించండి

ఆయన ప్రేమను భరించలేను… విడాకులు ఇప్పించండి

Husbandయుఎఇలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భర్త మంచితనాన్ని, ఆయన పంచే ప్రేమను భరించలేని ఓ భార్య తనకు భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టు మెట్లు ఎక్కింది. షార్జాకు చెందిన ఓ జంటకు ఏడాది క్రితం పెళ్లి చేరిగింది. అయితే ఈ ఏడాది కాలంలో భార్య పలుమార్లు భర్తపై విసుక్కున్నా, అతడు మాత్రం ప్రేమనే పంచేవాడు. భర్తతో కావాలని గొడవ పడుతున్నప్పటికీ, అతను మాత్రం మంచితనం తో మౌనంగా ఉంటూ ప్రేమను పంచేవాడని సదరు భార్య పేర్కొంది. ఈ క్రమంలో ఒకసారి లావు తగ్గాలని సదరు భార్య భర్తకు సూచించింది. దీంతో అతడు బరువు కూడా తగ్గి భార్య కోరిక తీర్చాడు. ఈ క్రమంలో అతడి ప్రేమను, మంచితనాన్ని భరించలేనని చెప్పడంతో న్యాయమూర్తులు కూడా ఆశ్చర్య పోతున్నారు. ఈ ఘటన యుఎఇలోని షిరయత్ కోర్టులో జరిగింది. ఈ విషయంపై సదరు భర్తను కోర్టు ప్రశ్నించింది. తనకు తన భార్య అంటే ఎంతో ఇష్టమని, ఆమె తనకు కావాలని, ఆమెతో ఘర్షణ పడలేనని కోర్టుకు తెలిపారు. దీంతో ఈ విషయంపై భార్యభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలని  కోర్టు వారికి సూచించింది. ఏడాది కాలంలోనే భార్యాభర్తల సంబంధాలపై ఎటువంటి అవగాహనకు రాలేమని కోర్టు వారికి చెప్పింది.

I cannot bear His Love … Give Me Divorce