Saturday, April 20, 2024

అమెరికాలో ఉవ్వెత్తున ఊపిరి ఉద్యమం

- Advertisement -
- Advertisement -

I Can't Breathe Protest in America

 

మరింతగా విస్తరిస్తున్న ‘ఐ కాంట్ బ్రీత్’ నిరసనాగ్నులు

వైట్ హౌస్ వద్ద ఉద్రిక్తత, బంకర్‌లో గంటపాటు ట్రంప్, 40 నగరాల్లో కర్ఫూ

వాషింగ్టన్ /మిన్నియాపాలిస్: అమెరికాలో నల్లజాతీయుల నిరసనలు తీవ్రస్థాయికి చే రుకుంటున్నాయి. దీనితో అమెరికాలో మొత్తం 40 నగరాలలో కర్ఫూ విధించారు. వాషింగ్టన్ డిసితో పాటు ప లు ప్రధాన నగరాలు పట్టణాలలో కర్ఫూ విధించినట్లు అధికారులు తెలిపారు. ఇతరత్రా ఏఏ ప్రాంతాలలో ఆంక్షలు విధించారనేది వెల్లడి కాలేదు.  న్యూయార్క్‌లో నల్లజాతీయుడు
పోలీసుల దౌర్జన్యంతో మృతి చెందిన నాటి నుంచి బ్లాక్‌ల నిరసనలు ఉధృతం అవుతూ వచ్చాయి. ఇప్పుడు వాషింగ్టన్‌లోని దేశాధ్యక్ష భవనం శ్వేతసౌథం ఎదుట కూడా భారీ ప్రదర్శనలు జరిగాయి. పలు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో కర్ఫూ విధించినట్లు ఆయా రాష్ట్రాల గవర్నర్లు తెలిపారు. వాషింగ్టన్ డిసిలో కర్ఫూ విధించడం కీలక పరిణామంగా మారింది. ఆందోళన తీవ్రత ఎక్కువగా ఉన్న 15 రాష్ట్రాలలో ఇప్పటికీ 5వేల తో మంది జాతీయ భద్రతా దళ సిబ్బందిని రంగంలోకి దింపినట్లు దళం ఉన్నతాధికారి జోసెఫ్ లెంగ్యల్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని పోలీసు వ్యవస్థలోనే నల్లజాతీయుల పట్ల నిరసనతో కూడిన జాత్యాహంకర భావన వస్తుందనే వాదనను జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియన్ ఖండించారు. పలు ప్రాంతాలలో సోమవారం కూడా నల్లజాతీయులు ప్రదర్శనలు నిర్వహించారు.

తమ పట్ల పోలీసులు వివక్షతను చూపుతున్నారని, వారి చేతుల్లో తాము చిత్రహింసలకు గురి అవుతున్నామని పేర్కొంటూ ర్యాలీలు తీశారు. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు వార్తలు వెలువడ్డా, నల్లవారి ఈ నిరసనలు మొత్తం మీద శాంతియుతంగా సాగుతున్నట్లు స్పష్టం అయింది. న్యూయార్క్‌లోర్‌లో ఓ నల్లజాతీయుడిని పోలీసులు మత్తు సిగరెట్లు అమ్ముతున్నాడనే ఆరోపణపై వేధించడం తరువాతి క్రమంలో నిరసనలకు దారితీసింది. తరువాత స్థానికంగా మిన్నియాపాలిస్‌లో ప్రదర్శనల సమయంలో ఓ ట్రక్కు డ్రైవర్ ర్యాలీపైకి చొచ్చుకు రావడం మరింత కలకలం రేపింది. ప్రస్తుతం బోస్టన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్‌కో వరకూ నల్లజాతీయుల ప్రదర్శనలు సాగుతున్నాయి. ఫిలడెల్ఫియా, కాలిఫోర్నియా, సాంటా మోనికాలలో నల్లజాతీయులు కొందరు పట్టపగలు మాల్స్‌లోపలికి చొరబడి దోచుకుంటున్నట్లు వెల్లడైంది. నల్లజాతీయులకు ఇతరులకు మధ్య ఘర్షణాయుత వాతావరణం నెలకొంటున్న దశలో పలు ప్రాంతాలలో అధికార యంత్రాంగం జాగ్రత్త చర్యలు తీసుకొంటోంది. నల్లజాతీయుల ప్రదర్శనల దశలో కవ్వింపు చర్యలకు పాల్పడేందుకు కొందరు కావాలనే యత్నిస్తున్నట్లు వెల్లడి అవుతున్నందున వీటిని నివారించేందుకు అధికారులు యత్నిస్తున్నారు.

I Can’t Breathe Protest in America

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News