ఇలియానా కెరీర్ బాలీవుడ్లో చిత్ర విచిత్రంగా సాగుతోంది. అప్పటికప్పుడే స్టార్డమ్… ఆతర్వాత పూర్తిగా డల్‌నెస్… ఇది ఇలియానాకి కూడా ఒకింత విచిత్రంగానే అనిపిస్తోందట. ‘బాలీవుడ్ అంటేనే అంత…’ అంటూ నిట్టూర్చింది ఈ భామ. “ప్రస్తుతానికి బాలీవుడ్లో నా ఇమేజ్‌కు ఢోకా ఏమీ లేదు. అవకాశాలైతే వస్తున్నాయి. ఇప్పటికీ నాకు ఆఫర్లు వస్తున్నాయంటే నా ఇమేజ్ స్ట్రాంగ్‌గా ఉన్నట్లే…”అని చెప్పింది ఇలియానా. అయితే ఎప్పటినుంచో ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమాయణం నడుపుతున్న ఇలియానాను పెళ్లి గురించి ప్రశ్నిస్తే మాత్రం… “ఇప్పటికైతే పెళ్లి ఆలోచన లేదు. పెళ్లి చేసుకోకూడదని కాదుగానీ… ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను కదా. ఆండ్రూ నా జీవితంలో వెరీ వెరీ స్పెషల్. భర్త అనే పోస్ట్ అతనికి ఎప్పుడు ఇవ్వాలన్న దానిపై నాకంటూ ఓ ఖచ్చితమైన ఐడియా ఉంది”అని చెప్పింది ఈ భామ. సినిమా అవకాశాలతో బిజీగా ఉండడం వల్లే పెళ్లి గురించిన ఆలోచన చేయట్లేదట ఇలియానా. హీరోయిన్గా కొనసాగాలంటే ఫిట్నెస్తో ఉండాల్సిందేనని… గ్లామర్ కోసం ఎక్కువగా స్విమ్మింగ్‌నే ఆశ్రయిస్తానని చెప్పింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఇలియానా చేతిలో ‘ముబారకన్’ సినిమాతో పాటు ‘బాద్షాహో’ అనే సినిమా కూడా ఉంది.