Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఎస్‌ఐ కులం నాకెట్ల తెలుస్తుంది: రాజకుమారి

ఎస్‌ఐ కులం నాకెట్ల తెలుస్తుంది: రాజకుమారి

Nannapaneni

 

అమరావతి: ఆ మహిళ ఎస్‌ఐని తాను దూషించలేదని టిడిపి నేత, మహిళా కహిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. గురువారం నన్నపనేని రాజకుమారి మీడియాతో మాట్లాడారు. ఎస్‌ఐ కులం తనకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. దళితుల అభ్యున్నతి కోసం ఎన్నో మంచి పనులు చేశానని, అలాంటిది దళిత మహిళను దూషించడం ఏంటని అని అడిగారు. తనపై వైసిపి ప్రభుత్వం బురద జల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను ఎంతో ప్రేమగా చూశానన్నారు. రాజకుమారి తనని కులం పేరుతో దూషించిందని తన పైఅధికారులకు ఎస్‌ఐ అనురాధ ఫిర్యాదు చేసింది. దీంతో నన్నపనేనిపై ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 303, 506, 509, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.