Tuesday, February 7, 2023

కళ్లు చెమ్మగిల్లాయన్న అదితి

- Advertisement -

aditi-rao-hydari-ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘డ్యూయెట్’. కార్తీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ అదితీరావ్ హైదరీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… బాలీవుడ్‌లో హాట్ ఇమేజ్ ఉన్న తారను మణిరత్నం తన సినిమాలో ఎంపికచేసుకోవడం. రాజ్ 3 చిత్రంలో అందాల ఆరబోతతోనే బాగా పాపులర్ అయింది అదితి. ఆ తర్వాత ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఇక మణిరత్నం నుంచి ‘డ్యూయెట్’ సినిమాలో ఆఫర్ అనగానే తాను నమ్మలేకపోయానని చెప్పింది అదితీరావ్ హైదరీ. ఈ సినిమాలో అవకాశం రావడం తన అదృష్టమని చెప్పింది. మణిరత్నం కథ చెప్పడం మొదలుపెట్టిన దగ్గర నుంచీ తనను తాను మైమర చిపోయాననీ… కథ పూర్తయ్యేస రికి కళ్లు చెమ్మగిల్లా యని పే ర్కొంది. ఈ సినిమా ఎప్పు డు విడుదలవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని చెప్పింది. మరి ఈ సినిమా విడుదల తర్వాత అదితి ఇమేజ్ ఏవిధంగా మారుతుందో చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles