Home తాజా వార్తలు ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి పోవడం లేదు…

ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి పోవడం లేదు…

i have not received an invitation from imran says aamir khan

ముంబయి: పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ చేసే ప్రమాణస్వీకారానికి తాను వెళ్లడం లేదని బాలీవుడ్  స్టార్ హీరో ఆమిర్ ఖాన్  స్పష్టం చేశారు. తాను ఈ కార్యక్రమానికి వెళ్తున్నట్టు వస్తన్న పుకార్లను ఆమిర్ ఖండించారు. అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం రాలేదన్నారు. క్రికెటర్లు గవాస్కర్, కపిల్ దేవ్, సిద్ధూలతో పాటు ఆమిర్ ఖాన్ కు కూడా ఆహ్వానం అందినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై ఆమిర్ స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. పానీ ఫౌండేషన్ కార్యక్రమాల్లో తాను బిజీగా ఉన్నానని పేర్కొన్నారు. ఆగష్టు 12న జరిగే ప్రజా కార్యక్రమానికి హాజరవుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 10 వేల మంది గ్రామస్తులు పాల్గొంటారని ఆమిర్ తెలియజేశారు. ఇమ్రాన్ ప్రమాణస్వీకారానికి తాను వెళ్తున్నట్టు సిధ్దూ ఇదివరకే ప్రకటించారు.