Thursday, April 18, 2024

చిన్న వయసులోనే చాలా నేర్చుకున్నా..

- Advertisement -
- Advertisement -

I learnt lot of things in my early years: Renu desai

బద్రి, జానీ సినిమాల నాటి సంగతులను మరోసారి గుర్తుచేసుకుంది రేణు దేశాయ్. 18 ఏళ్ల చిన్న వయసులో ‘బద్రి’లో నటించానని, ఆ అనుభూతులను జీవితాంతం మరచిపోలేనని ఆమె చెప్పింది. ఇక ‘జానీ’ సినిమా కోసం చాలా హార్డ్‌వర్క్ చేశానని పేర్కొంది. “బద్రి సినిమా చేస్తున్న సమయంలో నాకు కేవలం 18 ఏళ్లు మాత్రమే. అంత చిన్న వయసులో ముంబయ్ నుంచి వచ్చాను. ‘బద్రి’ యూనిట్‌లో అందరూ నన్ను బాగా చూసుకున్నారు. ఆ తర్వాత ‘జానీ’ సినిమా చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నాను. చిన్న వయసులోనే కేవలం నటిగా కాకుండా చాలా విభాగాలు చూసుకున్నాను. రోజుకు 16, 17 గంటలు పనిచేయగలనని అప్పుడే తెలుసుకున్నాను. మూవీ మేకింగ్‌కు సంబంధించి చాలా విషయాలు నేర్చుకుంది ‘జానీ’ టైమ్‌లోనే. ఇక పవన్‌కళ్యాణ్‌తో కలిసి నటించడం నాకు మరచిపోలేని అనుభూతులను మిగిల్చింది”అని పేర్కొంది రేణు దేశాయ్. “ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో రష్మిక అంటే నాకు ఇష్టం. ఆమె లుక్స్, యాక్టింగ్ చాలా బాగుంటాయి. దర్శకుల్లో మాత్రం ఫేవరేట్ అంటూ ఎవరూ లేరు. రాజమౌళి, అనీల్ రావిపూడి, త్రివిక్రమ్ టేకింగ్స్ నచ్చుతాయి”అని చెప్పింది రేణు దేశాయ్.

I learnt lot of things in my early years: Renu desai

I learnt lot of things in my early years: Renu desai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News