Home రాష్ట్ర వార్తలు నేనూ సెటిలర్‌నే

నేనూ సెటిలర్‌నే

charminar– దేశోద్ధారక భవన్ మీట్ ది ప్రెస్‌లో మంత్రి కెటిఆర్
హైదరాబాద్: హైదరాబాద్‌లో అందరూ సెటిలర్లే అని ఆమాటకు వస్తే తాను కూడా సెటిలర్‌నే అని పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తాను సిద్ధిపేటలో పుట్టానని.. ఇప్పుడు హైద రాబాద్‌లో ఉంటున్నానని చెప్పారు. విభిన్న సంస్కృ తుల సమ్మేళనం హైదరాబాద్‌లో కనిపిస్తుందని, అం దుకే భాగ్యనగరం ఓ మినీ భారతదేశంగా భావించ వచ్చని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను పురస్కరించుకుని బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టియుడబ్లుజె) మంగళవారం నాడు మంత్రి కెటిఆర్‌తో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమం నిర్వహించింది. టియుడబ్లు జె రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐజెయూ పూర్వ సెక్రెటరీ జనరల్, మన తెలంగాణ సంపాదకులు కె.శ్రీనివాస్ రెడ్డి, ఐజెయు సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, టిఆర్‌ఎస్ ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, టియుడబ్లుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరా హత్ అలీ, హెచ్‌యుజె అధ్యక్షులు కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంత కుముందు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియయన్, హైదరా బాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ రూపొందించిన 2016 డైరీని మంత్రి కెటి ఆర్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ క్యాలెండర్‌ను కూడా విడుదల చేశారు. తొలుత జిహెచ్‌ఎంసి ఎన్నికలు, అభి వృద్ధి ప్రణాళికలను వివరించిన కెటిఆర్.. తరువాత మీడియా ప్రతినిధులు వే సిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. గతంలో జాగో బాగో నినాదాలు చేసిన విషయాన్ని చాలా మంది ప్రస్తావిస్తున్నారని, ఆంధ్రా నేతల ప్రకటనల దృష్టా నాటి పరిస్థితుల్లో నినాదం సరైనదేనని, దానిని తప్పుగా భావించడం లేదని వివరించారు. అధికారంలోకి వస్తే సెటిలర్లను, ఆంధ్రోళ్లను హైదరా బాద్ నుంచి వెళ్లగొడతారని, వ్యాపారాలు చేసుకోనివ్వరని మాపై చాలా విష ప్రచారం జరిగిందని ఒక్కరినైనా ఇబ్బంది పెట్టామా అని ఆయన ప్రశ్నించా రు. ఎన్నికలను ఏకపక్షం చేయాలని, ప్రతిపక్షాలను పూర్వప క్షం చేసి టిఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.టిఆర్‌ఎస్ మేనిఫె స్టోను మరో మూడు రోజుల్లోనే ప్రకటిస్తామన్నారు. తాము ఇస్తున్న హామీల ను కచ్చితంగా ఐదేళ్ళలో అమలు చేసి తీరుతామని వెల్లడించారు. ఐటి రంగం లో స్థానిక రిజర్వేషన్‌లు సాధ్యం కాదని, ప్రైవేటు రంగంలో నైపుణ్యం కలిగిన వ్యక్తులనే తీసుకుంటారని చెప్పారు. అందుకే తాము టాస్క్ పథకం కింద తెలంగాణ విద్యార్థులకు శిక్షణ ఇస్తూ అవకాశాలను అందిపుచ్చుకునేలా చే స్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానం తెలిపారు. హైదరాబాద్‌కు ఎప్పటి నుం చో గుర్తింపు ఉన్నదని కొత్తగా ఎవరూ ప్రపంచ పటంలో పెట్టలేదని ఆయన టిడిపి అధినేత చంద్రబాబునుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఐదు జి ల్లాలకు మన నగరం విస్తరించిందని తెలంగాణలో మూడో వంతు జనాభా హైదరాబాద్‌లోనే ఉందన్నారు. గత పాలకులు హైదరాబాద్‌పై తీవ్ర వివ క్షనుచూపారని కెటిఆర్ విమర్శించారు. పునాది రాళ్లేస్తే రాజధానికి నీళ్లు రావ ని, చుక్క నీరు లేక సింగూరు, మంజీరా, గండిపేట ఎండిపోతే గత పాలకులు పట్టించుకోలేదన్నారు. అందుకే సిఎం కెసిఆర్ నగరానికి ఉత్తర, దక్షిణాన రెం డు రిజర్వాయరుల నిర్మాణానికి నిర్ణయించారని తెలిపారు.నగరంలో సరైన ఫుట్‌పాత్‌లు లేని విషయం గురించి ప్రస్తావించగా, తప్పకుండా ఆ పని చేస్తామని మంత్రి తెలిపారు.
లక్ష సిసి కెమెరాలతో నిఘా
హైదరాబాద్‌లో లక్ష సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తామని, చైన్ స్నాచింగ్‌లకు చెక్ పెట్టి మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తామని కెటిఆర్ న్నారు. ఇప్పటికే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం సిద్ధమవుతోందన్నారు. 10 కోట్ల మొక్కలు నాటి హైదరాబాద్‌ను హరిత హారంగా తీర్చిదిద్దుతామన్నారు. మెహిదీపట్నం పివి నర్సింహారావు ఎక్స్‌పెస్ హైవే తరహాలో హైదరాబాద్‌లో మరో 11 ఆకా శమార్గాల (స్కై వేస్ )నిర్మాణం చేపడతామన్నారు. నియోజకవర్గానికో కొత్త మోడల్ మార్కెట్టు, అవసరమైన చోట్ల 440 కెవి విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పా టు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో రద్దీ ఉన్న 54 జంక్షన్లను విస్తరిస్తామన్నా రు. లంగర్‌హౌస్ బాపూఘాట్ ప్రాంతంలో పిక్నిక్ స్పాట్‌లాంటివి ఏర్పాటు చేసి పౌరులకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామన్నారు. చంచల్‌గూడ జై లు, రేస్ కోర్సును సిటీ అవతలికి తరలించి అక్కడున్న వంద ఎకరాలను ఇతర అవసరాలకు వినియోగిస్తామన్నారు. 100 కోట్లతో హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళ న చేస్తామని, ట్యాంక్ బండ్‌లోని పాత నీటిని తోడేసి కొత్త నీటితో ఆ ట్యాంక్ ను నింపుతామన్నారు. హుస్సేన్ సాగర్‌లోకి నాలాల్లోంచి కలుషిత నీరు చేర కుండా ఒకటిన్నర నెలల్లోనే వైశ్రాయ్ హోటల్ వద్ద నుంచి ప్రత్యేక కాలువ ద్వారా మూసికి అనుసంధానం చేస్తామన్నారు. ఉపాధి కల్పన, నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తున్నామన్నారు. రూ. 600 కోట్ల నల్లా బిల్లులు, క రెంటు బిల్లులు మాఫీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పాతబస్తీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. అవసరమైతే మెట్రోరైలును మరిం త దూరం విస్తరిస్తామన్నారు.
సమాజంలో మీడియా పాత్ర కీలకం..
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని మంత్రి కేటిఆర్ అన్నా రు. తెలుగు రాష్ట్రాల్లో మీడియా అత్యంత క్రియాశీలకంగా పని చేస్తోందన్నా రు. తాను కూడా రోజూ గంటన్నర పాటు పత్రికలను చదువుతానని, సిఎం కెసిఆర్ రోజుకు 15 పత్రికలు చదువుతారని, వాటిల్లో సంపాదకీయాలతో పా టు, పాఠకుల లేఖలను కూడా కూలంకషంగా చదువుతారని తెలిపారు. ప్ర జా సమస్యలను పత్రికల ద్వారా ప్రభుత్వానికి నేరుగా చేరవేయడంలో జర్న లిస్టుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ పరంగా తాము కూడా హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాల లాంటి కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. వరంగల్ జిల్లాలో సిఎం కెసిఆర్ ఇటీవలే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను ప్రకటించార ని, ఇది ఆ జిల్లాకే వర్తించదని, దశల వారీగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపడతామన్నారు. సందర్భంగా హైదరాబాద్ వర్కింగ్ జర్నలిస్ట్ యూని యన్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లు రూపొందించిన 2016 సంవత్సరం నూతన డైరీ, క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు.