Thursday, April 25, 2024

వ్యాక్సిన్ క్యాంపు కొరకు ఐ వ్యాక్సినేషన్ యాప్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు ప్రైవేట్ సంస్థలు నూతన విధానాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇంటి వద్దే వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్న వారికి యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్(యు ఎఫ్‌ఇఆర్ డబ్లూఎస్) ఐ వ్యాక్సినేషన్ యాప్‌ను సిద్ధం చేసింది. టీకా పొందాలనుకునే వారి వివరాలు ఆ యాప్‌లో నమోదు చేస్తే, వారి ఇంటి సమీపంలోనే క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీలు ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.

ఈ యాప్‌ను ఆదివారం ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్ ఆదివారం వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకొని వివరాలు పొందుపరచడం ద్వారా, డిమాండ్‌ను బట్టి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులను సమన్వయం చేసి వ్యాక్సిన్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. గృహాలు, అపార్ట్‌మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ను నిర్వహిస్తామని యాప్ ప్రతినిధులు పేర్కొంటున్నారు.అంతేగాక ఈ యాప్ ద్వారా అవసరమైన వారికి ఇంటికి వద్దకే మందులు సరఫరా చేసే కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు ప్రైవేట్ టెలీమెడిసిన్ , కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫ్రీ మెడికేషన్ వెబినార్స్ నిర్వహించడంతో పాటు అవసరమైన హెల్త్‌కేర్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు యుఎఫ్‌ఇఆర్ డబ్లూఎస్ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News