Home తాజా వార్తలు ప్రపంచకప్ గెలవడమే లక్ష్యం: మిథాలి రాజ్

ప్రపంచకప్ గెలవడమే లక్ష్యం: మిథాలి రాజ్

mithali-rajముంబై: టీమిండియా మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ సాధించడమే తన లక్ష్యమని వన్డే కెప్టెన్ మిథాలి రాజ్ అన్నారు. అదే తన కెరీర్ ను ముందుకు నడుపుతుందని మిథాలి రాజ్ పేర్కొన్నారు. ముంబైలో శుక్రవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడుతూ… తన కెరీర్ కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. “కెరీర్ లో సందర్భాన్ని బట్టి ప్రేరణ పొందేందుకు అనేక మార్గాలుంటాయి. ప్రస్తుతం భారత జట్టు  వరల్డ్ కప్ గెలవడమే నాకు ముఖ్యం. దాని కోసమే ప్రయత్నిస్తున్నా” అని మిథాలి తెలిపింది.

I Want To Win 2021 World Cup Says Mithali Raj