Tuesday, February 7, 2023

విలక్షణ నటిగా అలరిస్తా

- Advertisement -

Lavanya-Tripathiలావణ్య త్రిపాఠికి ఇకనుంచి యంగ్‌గా, గ్లామర్‌గా ఉండే రోల్స్ చేయాలనుందట. తనకు చాలా ఆపర్స్ వస్తున్నా… తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే పాత్రలు రావడం లేదని అంటోంది ఈ భామ. తాను చాలా కూల్, ఫన్నీగా ఉంటానని… అలాంటి క్యారెక్టర్‌లో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తానని అంటోంది లావణ్య. “ప్రస్తుతం నేనింకా దారిలోనే ఉన్నా. ఇంకా లక్షాన్ని చేరుకోలేదు. ప్రేక్షకులు ముందు నన్ను మిధున (అందాల రాక్షసిలో పాత్ర)గా గుర్తించారు. ఆతర్వాత నందన (భలే భలే మగాడివోయ్‌లో పాత్ర), ఇటీవల  సీత (సోగ్గాడే చిన్ని నాయనలోని పాత్ర)గా ఎంతో ఆదరాభిమానాలను చూపించారు. అయినా… ఇంకా నన్ను నన్నుగా గుర్తించాలని కోరుకుంటున్నా. నాలోని ఆ యాంగిల్ జనాలకు తెలియదు. తెలిస్తే బాగా రిసీవ్ చేసుకుంటారు. విలక్షణ నటిగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొనాలని కోరుకుంటున్నా. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి ప్రేక్షకులను అలరిస్తా. ఈ ప్రయత్నంలో నేను తప్పకుండా సఫల మవుతాను”అని అంటోంది ఈ భామ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles