Home జాతీయ వార్తలు కేజ్రీవాల్ రాజీనామా చేయాలి : అన్నా హజారే!

కేజ్రీవాల్ రాజీనామా చేయాలి : అన్నా హజారే!

Hazare

న్యూఢిల్లీ : భూములకు సంబంధించిన కుంభకోణాల ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మండిపడ్డారు. తనపై వస్తున్న ఆరోపణలు నిజమని తేలితే వెంటనే రాజీనామా చేయాలని, లేదా కేజ్రీవాల్‌ని పదవిలోంచి తొలగించాలని అందుకోసం అవసరమైతే ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా రాలెగావ్ సిద్ధిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా తనతో కలిసి పోరాడిన కేజ్రీవాల్‌పై ఇప్పుడు అవినీతి ఆరోపణలు రావడం ఎంతో బాధ కలిగిస్తోందన్నారు.
ఇక కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేసిన మాజీ మంత్రి కపిల్ మిశ్రాపై కూడా అన్నా మండిపడ్డారు. మంత్రి పదవి పోయిన తర్వాతే కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేశారని, మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు చేతులు మారి ఉంటే, అప్పుడే అధికారులను ఎందు అప్రమత్తం చేయలేదని ప్రశ్నించారు.