టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా దూసుకుపో తున్న యంగ్ బ్యూటీ రకుల్‌ప్రీత్ సింగ్. వరుసగా హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటూ తిరుగులేని క్రేజ్‌ను సంపా దించు కుంటోంది ఈ హాట్ స్టార్. సాయిధరమ్‌తేజ్‌కు జోడీగా రకుల్ హీరోయిన్గా చేసిన తాజా చిత్రం ‘విన్నర్’. ఈ చిత్రం ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రకుల్‌ప్రీత్ సింగ్ చెప్పిన సినిమా విశేషాలు…
పూర్తిగా ఎంజాయ్ చేశా..
‘విన్నర్’లో నేను అథ్లెటిక్‌గా, జాకీగా కనిపిస్తా. సినిమాలో నా మూలంగానే సాయిధరమ్‌తేజ్ హార్స్ రేసింగ్‌లో పాల్గొంటాడు. అక్కడి నుంచే సినిమా కథ మొదలవుతుంది. ఫిట్నెస్ ఫ్రీక్ అయిన నేను ఈ సినిమా చేయడాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశాను. కొన్ని సీన్లలో అథ్లెటిక్ బాడీతో ప్రేక్షకులను అలరిస్తా.
కదిలించే భావోద్వేగ సన్నివేశాలు
హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘విన్నర్’. సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు ఎంతో రిచ్‌గా సినిమాను తెరకెక్కించారు. అత్యధిక శాతం హార్స్ రైడింగ్ సీన్లను టర్కీలో చిత్రీకరించడం జరిగింది. సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు అందరినీ కదిలిస్తాయి. పూర్తయిన తర్వాత సినిమా చూసినప్పుడు కొన్ని సన్నివేశాలు కంట తడిపెట్టించాయని తేజూ స్వయంగా చెప్పాడు.
తేజూ నాకు మంచి ఫ్రెండ్
తేజూ ఎంతో కాలంగా నాకు మంచి ఫ్రెండ్. దీంతో మేమిద్దరం కలిసి ఎంతో హుషారుగా ఈ సినిమా చేయడం జరిగింది. స్వీట్ హార్ట్ కలిగిన తేజూతో కలిసి పనిచేయడాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశాను.
అద్భుతంగా నటించగలిగాను
దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి నేను చేస్తున్న రెండో సినిమా ఇది. నటిగా అతనితో కలిసి పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఆయనిచ్చిన స్వేచ్ఛతో అద్భుతంగా నటించగలిగాను. సినిమాలో నా క్యారెక్టర్ గురించి ఆయన చెప్పిన తీరు నచ్చడంతోనే ఈ సినిమా చేశాను. నటీనటుల నుంచి తనకు ఏం కావాలో ఆయన చక్కగా రాబట్టుకుంటారు.
బెస్ట్ పర్ఫార్మెన్స్ కోసం కష్టపడుతున్నా..
టాలీవుడ్లో స్టార్ స్టేటస్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా. హీరోయిన్గా ఎంతో ఉన్నత స్థానానికి చేరుకున్న నేను పరిస్థితులు అనుకూలించకపోతే ఎప్పుడైనా కిందకు రావచ్చన్న విషయం నాకు తెలుసు. దీంతో చేస్తున్న సినిమాల్లో బెస్ట్ ఫర్ఫార్మెన్స్ కోసం కష్టపడుతున్నాను.
వంద శాతం న్యాయం
ప్రస్తుతం కొన్ని బిగ్ ప్రాజెక్ట్‌లు నా చేతిలో ఉన్నాయి. డేట్స్‌ను అడ్జస్ట్ చేయలేక గతంలో కొన్ని లక్కీ ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చింది. వీటిలో కొన్ని ఫ్లాప్‌లుగా నిలిచాయి. దీంతో దేవుడు నావెంట ఉన్నాడని అనిపించింది. ఇక ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు వంద శాతం న్యాయం చేయడానికి కృషిచేస్తున్నా.
మూడు సినిమాలు..
మార్చిలో కార్తీతో కలిసి ఓ తమిళ్ సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతం మహేష్‌బాబు సినిమాతో పాటు నాగచైతన్య మూవీ కూడా చేస్తున్నాను. ఈ మూడు మంచి సినిమాలు నా కెరీర్లో బిగ్ హిట్స్‌ను ఇస్తాయన్న నమ్మకముంది.