Friday, June 2, 2023

పోసానిపై దాడికి జన‘సేన’ యత్నం

- Advertisement -
- Advertisement -

I will file case against Pawan Kalyan Says Posani

హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో పవన్ కళ్యాణ్‌పై పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు జగన్‌లాగ
పాదయాత్ర చేయగలడా అంటూ ప్రశ్న పోసానిపై దాడికి జనసేన నేతల యత్నం అదుపులోకి తీసుకొని పంజాగుట్ట స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు పవన్‌కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తా తన చావుకు పవన్ కళ్యాణే కారణం

మనతెలంగాణ/ హైదరాబాద్: ఎపి సిఎం వైఎస్ జగన్‌కు తాను వీరాభిమానినని, ఆయనను ఎవరైనా ఏమన్నా అంటే తాను భరించలేనని పోసాని స్పష్టం చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల ఎపి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నటుడు పోసాని కృష్ణమురళి మంగళవారం నాడు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతు కనీసం ఐదారు కిలోమీటర్లు కూడా నడవలేని పవన్ కల్యాణ్, పాదయాత్రలో వేల కిలోమీటర్లు నడిచిన జగన్ తో పోల్చుకోవడం తనకు నచ్చలేదన్నారు. పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు చేసినందుకు తనకు వేల సంఖ్యలో ఫోన్ కాల్స్, సందేశాలు వస్తున్నాయని అందుకే మరోసారి మీడియా ముందుకు వచ్చానన్నారు.ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతుండగానే ఓ కాల్ వచ్చిన విషయాన్ని కూడా అందరికీ చూపించారు.

పవన్ వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తున్నందునే తాను స్పందించాల్సి వచ్చిందని స్పష్టత ఇచ్చారు. అవేవిధంగా గతంలో పవన్ కల్యాణ్ కు, తనకు మధ్య జరిగిన ఓ గొడవను పోసాని మీడియాకు వివరించారు. తాను సాధారణంగా సాయంత్రం 6 గంటలకే షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లిపోతానని, కానీ ఓసారి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సమయంలో రాత్రి షెడ్యూల్ పెట్టారని వెల్లడించారు. రాత్రి 9 గంటలు అవుతున్నా గానీ పవన్ రాలేదని, దాంతో తాను ఇంటికి వెళ్లిపోయానని తెలిపారు. ఆ రోజు రాత్రి 10.30 గంటల సమయంలో భోజనం చేస్తుండగా పవన్ ఫోన్ చేసి తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ‘ఇది సినిమా అనుకున్నారా, ఇంకేమైనా అనుకున్నారా? ఎవరికి చెప్పి ఇంటికి వెళ్లారు? మేమందరం పిచ్చోళ్లమా? అంటూ పవన్ కేకలు వేశారు. దాంతో నాక్కూడా కోపం వచ్చింది. నేను కూడా ఆర్టిస్ట్ నే… మీకోసం 9 గంటల వరకు చూశాను మీరు రాలేదు. మీరు 10 గంటలకి వస్తే అప్పటిదాకా మేం ఎదురుచూస్తుండాలా? అంటూ నేను కూడా అదే స్థాయిలో బదులిచ్చానన్నారు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నుంచి నన్ను తీసేశారు‘ అంటూ వివరించారు.

పవన్ కల్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తా

తన కుటుంబంపై అభిమానులతో అనుచిత వ్యా ఖ్యలు చేయించిన పవన్ కల్యాణ్‌పై పోలీసులకు ఫి ర్యాదు చేయనున్నట్లు ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి తెలిపారు. పవన్ కల్యాణ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. అభిమానుల దాడిలో తాను చనిపోతే పవన్ కల్యాణే కారణమని ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

పోసానిపై దాడికి యత్నం

ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడి వెళ్తున్న క్రమంలో పోసానిపై పలువురు పవన్ అభిమానులు దాడికి యత్నించారు. దీంతో తాను బుధవారం నాడు పవన్ కల్యాణ్‌పై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కాగా వివాదం సమయంలో అక్కడే ఉన్న పంజాగుట్ట పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోసానిని సురక్షితంగా పోలీసు వాహనంలో ఆయన నివాసానికి తరలించారు.

అభిమానులను అదుపులో పెట్టుకోండి

పవన్ కల్యాణ్ తన అభిమానులను నియంత్రణలో పెట్టుకోవాలని పోసాని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా పోసానిపై ఫిర్యాదు చేస్తామని తెలంగాణ రాష్ట్ర జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ పేర్కొన్నారు. పోసానికి ఏమైనా ఇబ్బంది ఉంటే న్యాయపరంగా వెళ్లాలని ఈ తరహాలో మాట్లాడడం సరికాదని ఆక్షేపించారు. ఆయన వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలతో పాటు పవన్‌కల్యాణ్ అభిమానుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. పోసానిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలిరావడంతో హడావుడి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News